Share News

IPL 2024: హ్యారీ బ్రూక్ స్థానంలో ఆ ప్లేయర్‌ను తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ABN , Publish Date - Apr 08 , 2024 | 06:34 PM

ఐపీఎల్ 2024లో (IPL 2024) వరుస ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals) డీలాపడింది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ఓడింది.

IPL 2024: హ్యారీ బ్రూక్ స్థానంలో ఆ ప్లేయర్‌ను తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2024లో (IPL 2024) వరుస ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals) డీలాపడింది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ఓడింది. వరుస ఓటముల నేపథ్యంలో తాజాగా ఆ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమైన ఇంగ్లండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్ (Harry Brook) స్థానంలో మరో ఆటగాడిని తీసుకుంది. బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్‌ను(Lizaad Williams) జట్టులోకి చేర్చుకుంది. అతని కనీస బేస్ ధర రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా గత ఐపీఎల్ వేలంలో హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే లిజాడ్ విలియమ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులో చేర్చుకున్న విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి అధికారికంగా ప్రకటించింది.


‘‘టాటా ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌లకు ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్ లిజాడ్ విలియమ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులోకి చేర్చుకుంది. అతని ప్రాథమిక ధర రూ.50 లక్షలకు జట్టులోకి తీసుకుంది. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విలియమ్స్ సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు రెండు టెస్టులు, నాలుగు వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.’’ అని ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది. కాగా ఇటీవల హ్యారీ బ్రూక్ అమ్మమ్మ చనిపోయింది. ఇలాంటి విషాదకర సమయంలో కుటుంబంతో గడపాలని బ్రూక్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఐపీఎల్‌లో ఆడనని ప్రకటించాడు. అంతకుముందు అమ్మమ్మ అనారోగ్యం కారణంగానే భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి కూడా బ్రూక్ తప్పుకున్నాడు. అయితే బ్రూక్ ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నప్పటికీ త్వరలో దేశవాళీ క్రికెట్‌లో ఆడనున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో యార్క్‌షైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

IPL 2024: ముంబై, లక్నో విజయాలతో పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఇవే!

Updated Date - Apr 08 , 2024 | 06:34 PM