Share News

Viral Video: ప్రపంచంలో అత్యంత క్రూరమైన చేప! మొసలి కూడా క్షణాల్లో ఖతం! షాకింగ్ వీడియో

ABN , Publish Date - Mar 23 , 2024 | 06:34 PM

క్రూరమైన చేపగా పేరుపడ్డ ఆఫ్రికన్ టైగర్ ఫిష్ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Viral Video: ప్రపంచంలో అత్యంత క్రూరమైన చేప! మొసలి కూడా క్షణాల్లో ఖతం! షాకింగ్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: ఉపరితల జీవుల గురించి మనిషికి చాలా వరకూ తెలిసినా సముద్ర జీవాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. ఇక ప్రమాదకరమైన జీవులంటే మనకు సాధారణంగా సొరచేపలు, లేదా తిమింగలాలు గుర్తొస్తాయి కానీ కొన్ని చేపలు ఇంకా క్రూరంగా ఉంటాయి. వేట కుక్కల్లా గుంపుగా వేటాడుతూ ఇతర జీవాల్ని బలితీసుకుంటాయి. అంతటి ప్రమాదకర నేపథ్యం ఉన్న ఆఫ్రీకా టైగర్ ఫిష్ (Africa Tiger Fisht) వీడియో (Viral Video) ఒకటి ప్రస్తుతం నెటిజన్లను భయపెడుతోంది.

Viral Video: యువకుడిపై పగ తీర్చుకున్న తేనెటీగల దండు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యం


పెద్ద పెద్ద కోరలు ఉండే ఈ చేపలు అత్యంత క్రూరమైనవి (Violent Fish), ఆఫ్రీకాలోని నదులు, సరస్సుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ఎంత క్రూరమైనవంటే మొసళ్లను వేటాడేందుకు కూడా వెనకాడవట. బలమైన దవడల కారణంగా ఇవి మొసలి ఎముకల్ని కేవలం 30 సెకెన్లలో విరగొట్టేయగలవు. వీటి ఆకారం చూస్తే ఎవ్వరైనా భయపడిపోవాల్సిందే. తొలుత ఈ చేప ఫొటో చూసిన అనేక మంది ఇది పిరానా అనుకుని భ్రమపడ్డారు. అయితే, ఈ రెండూ వేర్వేరు జాతులకు చెందినవి. పోలీకలు చాలా తక్కువ.

Viral: కొందరు ఫారినర్లకు భారత్ అంటే ఎప్పుడూ చిన్న చూపే.. షాకింగ్ వీడియో.. భారతీయుల ఆగ్రహం


అత్యంత క్రూరమైన చేపలుగా పేరుగాంచిన ఇవి సాధారణంగా నీటిపై ఎగురుతూ ఉండే పక్షులను ఆహారంగా తీసుకుంటాయి. అవసరమైతే మొసళ్లు వంటి భారీ జంతువులను వేటాడేందుకూ వెనకాడవు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే..కొంత కాలం క్రితం పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) గంగా నదిలో జాలర్లకు 70 కిలోల బరువున్న ఓ టైగర్ ఫిష్ దొరికింది. భారీ ఆకారంతో భయానకంగా ఉన్న దీన్ని చూసేందుకు అప్పట్లో జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. కిలో రూ.500 చొప్పున ఈ చేప అమ్ముడుపోయింది. ఫలితంగా ఈ ఉదంతం అప్పట్లో పేపర్లలో పతాకశీర్షికలకు ఎక్కింది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 06:42 PM