Share News

Viral Video: యువకుడిపై పగ తీర్చుకున్న తేనెటీగల దండు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యం

ABN , Publish Date - Mar 23 , 2024 | 04:36 PM

తేనెతుట్టెను కదిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: యువకుడిపై పగ తీర్చుకున్న తేనెటీగల దండు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యం

ఇంటర్నెట్ డెస్క్: అదేంటో కానీ కొందరి బుద్ధి వారిని కుదురుగా ఉండనివ్వదు. ఇలాంటి వాళ్లు ఏదోక తిక్క పని చేసి ఇబ్బందుల్లో పడుతుంటారు. కొందరైతే ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి ఓ వ్యక్తి తాలూకు షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది. వీడియోలో యువకుడు చేసింది చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈదేం పిదపకాలం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Viral: లీవ్ కావాలంటూ కంపెనీ సీఈఓ వద్దకు వెళ్లిన కొత్త ఉద్యోగి.. చివరకు జరిగిందేంటో చూస్తే..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, నదీతీరంలో ఓ చెట్టుకొమ్మ మీద తేనెతుట్టె ఉంది. నదిలో పడవపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆ తేనెతుట్టె దగ్గరకు వచ్చాడు. ఆ తరువాత ఊహించని విధంగా తన వద్ద ఉన్న తెడ్డుతో తేనెతుట్టెపై గట్టిగా కొట్టాడు. అంతే.. తేనెటీగలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చేశాయి. కింద పడవలో ఉన్న వ్యక్తిపై ఒక్కసారిగా దాడి చేశాయి (Bee Attack).

Viral: కొందరు ఫారినర్లకు భారత్ అంటే ఎప్పుడూ చిన్న చూపే.. షాకింగ్ వీడియో.. భారతీయుల ఆగ్రహం


ఒంటిపై షర్టు కూడా లేకుండా ఉన్న ఆ వ్యక్తి తేనెటీగల ధాటికి తట్టుకోలేక పోయాడు. వెంటనే తన పడవలో అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభించాడు. వీడియో ఇక్కడితో ముగిపోవడంతో తరువాత ఏమైందనేది తెలియరాలేదు. అయితే, అతడు మరణించే ఉంటాడని నెటిజన్లు అనేక మంది చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా అన్ని తేనెటీగలు దాడి చేయడం ప్రమాదకరమని అన్నారు.

Viral: డ్రైవర్ దణ్ణం పెట్టగానే వదిలేసిన ఏనుగు..లేకపోతే వీళ్లు ఏమైపోయేవారో!? షాకింగ్ వీడియో

మరికొందరు మాత్రం ఆ యువకుడికి తగిన శాస్తే జరిగిందని అన్నారు. తమతంట తాముగా తింగరి పనులు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటే ఎవరు మాత్రం చేసేదేముందని కామెంట్ చేశారు. ఘటన ఎక్కడ జరిగిందో తెలీనప్పటికీ నెట్టింట ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 04:45 PM