Share News

Viral: మెట్రో స్టేషన్‌లో ప్రయాణికురాలికి ఊహించని అనుభవం.. వెనకున్న ప్రయాణికుడు సడెన్‌గా..

ABN , Publish Date - Apr 21 , 2024 | 07:33 PM

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళ తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని వివరిస్తూ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌‌గా మారింది.

Viral: మెట్రో స్టేషన్‌లో ప్రయాణికురాలికి ఊహించని అనుభవం.. వెనకున్న ప్రయాణికుడు సడెన్‌గా..

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళ తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని వివరిస్తూ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌‌గా (Viral) మారింది. ఇది జనాలను విస్తుపోయేలా చేస్తోంది. రిషికా గుప్తా అనే బాధితురాలి కథనం ప్రకారం, ఆమె లిఫ్ట్‌లో ఉండగా వెనకున్న ఓ వ్యక్తి గుట్కా తిని ఆమెపై ఉమ్మేశాడు. అతడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని రిషికా ఆవేదన వ్యక్తం చేసింది. అతడి చర్యలు దారుణమని ఆమె వాపోయింది. ఎదుటి వ్యక్తిని ఇంతగా అగౌరవపరుస్తారని, ఇంత నీచానికి దిగజారుతారని తాను అస్సలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Viral: స్వస్తిక పేరున్న మహిళ అకౌంట్‌పై ఊబెర్ నిషేధం.. చివరకు క్షమాపణలు!


ఇలాంటిది మరో మహిళకు జరక్కూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని నెట్టింట పంచుకుంటున్నట్టు రిషికా తెలిపింది. ‘‘అసలు ఇలాంటి వాళ్ల ఆలోచనా ధోరణి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అతడు కనీసం నాకు క్షమాపణ కూడా చెప్పలేదు. ఈ వ్యక్తి మరే మహిళకూ ఎదురుపడకూడదని నేను కోరుకుంటున్నా’’ అని ఆమె పేర్కొంది. తన ప్యాంటుపై ఉన్న మరకల ఫొటో కూడా ఆమె షేర్ చేసింది (Womans shocking claim of being spat on at Delhi metro station).

రిషిక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది ఆమె పరిస్థితిపై ఆవేదన వెలిబుచ్చారు. మెట్రో పరిసరాల్లో గుట్కాకు అనుమతిలేదని, నిందితుడిపై జరిమానాతో పాటు ఇతర కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 07:53 PM