Share News

Viral Video: చపాతీలు ఇలా కూడా చెయ్యొచ్చా? ఓ ఇల్లాలి వంటింటి చిట్కాపై నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , Publish Date - Apr 14 , 2024 | 08:26 PM

చాలా షుగర్ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారు రాత్రి సమయంలో అన్నానికి బదులుగా చపాతీ తింటుంటారు. ఉత్తరాదిన అయితే చాలా మంది చపాతీలనే ఆహారంగా తీసుకుంటారు. అయితే చపాతీలు మెత్తగా రావడానికి ఒక్కొక్కరూ ఒక్కో టెక్నిక్ పాటిస్తారు.

Viral Video: చపాతీలు ఇలా కూడా చెయ్యొచ్చా? ఓ ఇల్లాలి వంటింటి చిట్కాపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
చపాతీ

చాలా షుగర్ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారు రాత్రి సమయంలో అన్నానికి బదులుగా చపాతీ (Chapati) తింటుంటారు. ఉత్తరాదిన అయితే చాలా మంది చపాతీలనే ఆహారంగా తీసుకుంటారు. అయితే చపాతీలు మెత్తగా రావడానికి ఒక్కొక్కరూ ఒక్కో టెక్నిక్ పాటిస్తారు. పొయ్యి దగ్గర గంటల తరబడి చెమటలు కక్కుతూ పని చేస్తారు. అయితే ఆ బాధ లేకుండా ఓ మహిళ కొత్త ట్రిక్ పాటించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@nandiniidnani అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ వంట గదిలో చపాతీలు చేస్తోంది. ముందుగా గోధుమ పిండిని కొంచెం పెద్ద సైజులో ఐదు పెద్ద చపాతీలుగా చేశారు. ఆ తర్వాత కుక్కర్‌ను తీసి స్టవ్ మీద పెట్టింది. ఆ కుక్కర్‌లో ముందుగా ఉప్పు వేసి దానిపై ఓ ప్లేట్ బోర్లించింది. ఆ ప్లేట్‌పై ఐదు చపాతీలను ఒకదానిపై ఒకటి పెట్టి కుక్కర్‌ను లాక్ చేసింది. విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసింది. మూత తెరిచి చూడగా చక్కగా, మెత్తగా ఉడికిన చపాతీలు కనిపించాయి.


తర్వాత ఆ చపాతీలకు నెయ్యి రాసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.7 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ``ఇది చాలా ప్రమాదకరం. నీరు లేకుండా కుక్కర్ పెడితే పేలిపోయే ప్రమాదం ఉంది``, ``ఇది నిజమైనదేనా. చాలా మందికి హెల్ప్ అవుతుంది``, ``ఇది ఎడిట్ చేసిన వీడియోలా ఉంది``, ``ఇలాంటి అసంబద్ధమైన వీడియోలను పోస్ట్ చేయకండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పోలీస్ స్టేషన్‌కు హారతి పళ్లెంతో ఎంట్రీ.. అవమానంతో కుంగిపోయిన పోలీసులు.. అసలు కథేంటంటే..


Viral: గోడలో ఏదో అలికిడి.. లోపల నుంచి బయటపడిన నిధిని చూసి షాక్.. అసలు ఏం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 14 , 2024 | 08:26 PM