Share News

Viral Video: ఏం ఐడియా బాసూ.. రోడ్డు మీద దొరికిన వంద నోటు.. ఆశగా దానిని తీసి చూస్తే షాకవ్వాల్సిందే..!

ABN , Publish Date - Apr 14 , 2024 | 04:36 PM

ప్రస్తుతం చాలా సంస్థలు మార్కెటింగ్, ప్రకటనల కోసం డబ్బులను విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు స్టార్ హీరోలు, క్రికెటర్లతో యాడ్‌లు రూపొందించి ప్రదర్శిస్తున్నాయి. భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తాయి. అంత స్థోమత లేని చిన్న సంస్థలు పాంప్లేట్లు రూపొందించి రోడ్ల మీద పంచుతుంటాయి.

Viral Video: ఏం ఐడియా బాసూ.. రోడ్డు మీద దొరికిన వంద నోటు.. ఆశగా దానిని తీసి చూస్తే షాకవ్వాల్సిందే..!
వంద రూపాయల నోటు

ప్రస్తుతం చాలా సంస్థలు మార్కెటింగ్, ప్రకటనల కోసం డబ్బులను విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు స్టార్ హీరోలు, క్రికెటర్లతో యాడ్‌లు రూపొందించి ప్రదర్శిస్తున్నాయి. భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తాయి. అంత స్థోమత లేని చిన్న సంస్థలు పాంప్లేట్లు రూపొందించి రోడ్ల మీద పంచుతుంటాయి. అలాంటి పాంప్లేట్లను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కనీసం చూడకుండా పారేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ కెఫే వినూత్నంగా పబ్లిసిటీ ప్లాన్ చేసింది (Viral Video).


ఆ కెఫే క్రియేటివ్ పబ్లిసిటీ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. cafe_mantralay అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రోడ్డుపై ఓ వంద నోటు పడి ఉంది (100 rupee note). ఓ వ్యక్తి వెళ్లి దానిని తీసుకున్నాడు. ఆ వంద నోటును పూర్తిగా విప్పి మరో వైపు చూసి షాకయ్యాడు. ఎందుకంటే అవతలి వైపు కేఫ్‌కు (Cafe) సంబంధించిన వివరాలు, అక్కడ దొరికే ఫుడ్స్ గురించిన యాడ్ మాత్రమే ఉంది. ఆ తరహా యాడ్ చాలా మందిని ఆకట్టుకంటోంది (Publicity).


తాము మోసపోయినట్టు గ్రహించినా, పబ్లిసిటీ కోసం అలా ప్లాన్ చేసిన కేఫ్ తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ మందికి పైగా వీక్షించారు. 3 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది స్మార్ట్ అడ్వర్టైజ్‌మెంట్``, ``ఇది కొత్త తరహా మోసం``, ``నేను కూడా ఈ పబ్లిసిటీ ట్రిక్‌ను ఉపయోగిస్తా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: మీ భర్త గే అంటూ మెసేజ్.. ఆ మహిళ దిమ్మతిరిగే రిప్లై ఇవ్వడంతో షాక్.. అసలు కథేంటంటే..


Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో అయస్కాంతం ఎక్కడ ఉందో 12 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 14 , 2024 | 04:36 PM