Share News

Viral: గోడలో ఏదో అలికిడి.. లోపల నుంచి బయటపడిన నిధిని చూసి షాక్.. అసలు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 14 , 2024 | 06:05 PM

ఈ ప్రపంచంలో చాలా మంది మనుషులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. రేపటి గురించి ఈ రోజే పొదుపు చేసి జాగ్రత్త పడతారు. మనుషులే కాదు.. కొన్ని ఇతర జంతువులు, పక్షులు కూడా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాయి. రాబోయే రోజుల గురించి ఆహారాన్ని దాచుకుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న కొన్ని ఫొటోలు చూస్తే ఆ మాట నమ్మక తప్పదు.

Viral: గోడలో ఏదో అలికిడి.. లోపల నుంచి బయటపడిన నిధిని చూసి షాక్.. అసలు ఏం జరిగిందంటే..
గోడ

ఈ ప్రపంచంలో చాలా మంది మనుషులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. రేపటి గురించి ఈ రోజే పొదుపు చేసి జాగ్రత్త పడతారు. మనుషులే కాదు.. కొన్ని ఇతర జంతువులు, పక్షులు కూడా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాయి. రాబోయే రోజుల గురించి ఆహారాన్ని దాచుకుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న కొన్ని ఫొటోలు చూస్తే ఆ మాట నమ్మక తప్పదు. కాలీఫోర్నియా (California)లోని ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. తన గోడలో ఉన్న నిధిని చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు (Viral News).


కాలీఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల పెస్ట్ కంట్రోల్ ఉద్యోగికి ఫోన్ చేసి తన ఇంటి గోడలో (Wall) ఏదో ఉన్నట్టు చెప్పాడు. వెంటనే ఆ ఉద్యోగి సదరు వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. గోడకు ఉన్న రంధ్రం నుంచి చూస్తే అసలు విషయం బయటపడింది. ఓ వడ్రంగి పిట్ట (woodpecker) ఆ గోడను స్టోరేజ్ స్పేస్‌గా వాడుకుంటోంది. ఆ గోడలో తను ఎక్కువగా తినే చెస్ట్ నట్ పళ్లను (chestnut fruits) దాచుకుంటోంది. వచ్చే నెల తేదా సీజన్‌ కోసం ఆ పళ్లను దాచుకుంది. ఆ మొత్తం పళ్లు బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.


ఆ గోడలో ఏకంగా 317 కిలోల చెస్ట్ నట్ ఫ్రూట్స్‌ను వడ్రంగి పిట్ట స్టోర్ చేసి ఉంచుకుంది షాకైన ఉద్యోగి వెంటనే ఫొటోలు తీసి వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ వడ్రంగి పిట్ట జీవితకాలానికి సరిపడినంత స్టోర్ చేసుకుంది``, ``ఆ పక్షికి కూడా మనుషుల స్వభావం అంటినట్టు ఉంది. అవసరమైన దాని కంటే ఎక్కువ దాచింది``, ``పాపం.. కొంత అయిన ఆ పక్షికి దక్కేలా చేయండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఏం ఐడియా బాసూ.. రోడ్డు మీద దొరికిన వంద నోటు.. ఆశగా దానిని తీసి చూస్తే షాకవ్వాల్సిందే..!


Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో అయస్కాంతం ఎక్కడ ఉందో 12 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 14 , 2024 | 06:05 PM