Share News

Viral Video: ఈ కుక్కకు ధైర్యం చాలా ఎక్కువ.. పాపం.. ఆ పాముకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు!

ABN , Publish Date - Apr 13 , 2024 | 08:15 PM

ఈ ప్రపంచంలో చాలా మంది పాములు అంటే విపరీతంగా భయపడతారు. మనుషులే కాదు.. ఇతర జంతువులు కూడా పాములు జోలికి వెళ్లేందుకు సాహసించవు. విషపూరిత సర్పాలు వేసే కాటు వల్ల ప్రాణాలు పోతాయని ఇతర జంతువులకు కూడా అవగాహన ఉంటుంది.

Viral Video: ఈ కుక్కకు ధైర్యం చాలా ఎక్కువ.. పాపం.. ఆ పాముకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు!
నాగుపాము, కుక్క

ఈ ప్రపంచంలో చాలా మంది పాములు (Snakes) అంటే విపరీతంగా భయపడతారు. మనుషులే కాదు.. ఇతర జంతువులు కూడా పాములు జోలికి వెళ్లేందుకు సాహసించవు. విషపూరిత సర్పాలు వేసే కాటు వల్ల ప్రాణాలు పోతాయని ఇతర జంతువులకు కూడా అవగాహన ఉంటుంది. అందులోనూ కింగ్ కోబ్రా (King Cobra) కాటు వేస్తే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అలాంటిది ఓ కింగ్ కోబ్రాతో ఓ చిన్న కుక్క (Dog) ప్రవర్తించిన తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది (Viral Video).


david0ff అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ భారీ కింగ్ కోబ్రా పడగ ఎత్తి కూర్చుని ఉంది. అక్కడకి క్యూట్‌గా ఉన్న ఓ చిన్న కుక్క వచ్చింది. ఆ పామును నాకుతూ ముద్దు పెట్టుకుంది. ఆ పాముతో ప్రేమపూర్వకంగా వ్యవహరించింది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుక్క అంత చేస్తున్నా ఆ పాము అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది తప్ప దానికి ఎటువంటి హానీ తలపెట్టలేదు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 37 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ``ఆ కుక్కతో ఎలా డీల్ చేయాలో పాముకు తెలియలేదు``, ``పాము ఆ కుక్క చర్యల వల్ల భయపడలేదు``, ``ఆ కుక్కతో పాము కూడా ప్రేమలో పడింది``, ``ఆ పాముకు కుక్క ప్రమాదకరంగా అనిపించలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: సింహం, పులి మధ్య బాక్సింగ్ ఫైట్.. చివరకు ఏం జరిగిందో చూడండి..!


Viral: మీ భర్త గే అంటూ మెసేజ్.. ఆ మహిళ దిమ్మతిరిగే రిప్లై ఇవ్వడంతో షాక్.. అసలు కథేంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 13 , 2024 | 08:15 PM