Share News

Viral Video: మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఫ్రీ స్నాక్స్, ఇంకా..

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:32 PM

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేయాలని అనేక మంది భావిస్తుంటారు. ఎందుకంటే అందులో ఉండే సౌకర్యాలు అలా ఉంటాయి మరి. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral Video: మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఫ్రీ స్నాక్స్, ఇంకా..

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌(Microsoft)లో జాబ్ చేయాలని అనేక మంది భావిస్తుంటారు. ఎందుకంటే అందులో ఉండే సౌకర్యాలు అలా ఉంటాయి మరి. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఉచితంగా ఆహారం, పానీయాలు అందిస్తారు. దీంతోపాటు ఇంటి వద్ద నుంచి పనిచేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీలో పనిచేసే పలువురు ఉద్యోగులు వారికి అందించే సౌకర్యాల గురించి ఓ వీడియో షూట్ చేసి Instagramలో పోస్ట్ చేశారు. అంతే అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతోంది.


ఈ వీడియోను ఫిబ్రవరి 14న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఒక్క రోజులోనే లక్షా 20 వేల మందికిపైగా లైక్ చేశారు. పోస్ట్ చేసినప్పటి నుంచి ఇది రెండు మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. వీడియోలో ఒక మహిళ తమ కార్యాలయ క్యాంపస్‌ను చూపించడంతో మొదలవుతుంది. ఆ తర్వాత ఇతర ఉద్యోగులు ఉచిత స్నాక్స్ సహా పలు రకాల సౌకర్యాల గురించి చెప్పారు. ఈ వీడియో చూసిన పలువురు మేము నిరుద్యోగులం, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోసం ఎలా అప్లై చేయాలని అడిగారు. మరొక వ్యక్తి మీరు చాలా మంచి వాతావరణంలో ఉద్యోగం చేస్తున్నారని ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు. మరొకరు మేము మైక్రోసాఫ్ట్ ఉద్యోగులం కాదు. కానీ మీ సౌకర్యాల పట్ల అసూయపడుతున్నామని అన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 04:36 PM