Share News

Watch Video: మంత్ర శక్తులేమైనా ఉన్నాయా ఏందీ.. వెలితో గ్యాస్ వెలిగించేశాడు..!

ABN , Publish Date - Jan 14 , 2024 | 06:24 PM

Viral News: అగ్గిపుల్లను చర్మానికి గీయడంతో అగ్గి రాజుకోవడం లాంటి సీన్లు మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఇక నిజజీవితంలోనూ కొన్ని సందర్భాల్లో ఒకరి చేతి వేళ్లు మరొకరి శరీరానికి తగిలితే కరెంట్ షాక్ తగిలినట్లుగా అనిపిస్తుంటుంది. ఇది సాధారణం. కానీ, వేళితో గ్యాస్ స్టౌవ్ వెలిగించడం ఎప్పుడైనా చూశారా? వేలు పెడితే గ్యాస్ స్టౌ ఆటోమాటిక్‌గా మండటం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి.

Watch Video: మంత్ర శక్తులేమైనా ఉన్నాయా ఏందీ.. వెలితో గ్యాస్ వెలిగించేశాడు..!
Boy Ignites Gas Stove

Viral News: అగ్గిపుల్లను చర్మానికి గీయడంతో అగ్గి రాజుకోవడం లాంటి సీన్లు మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఇక నిజజీవితంలోనూ కొన్ని సందర్భాల్లో ఒకరి చేతి వేళ్లు మరొకరి శరీరానికి తగిలితే కరెంట్ షాక్ తగిలినట్లుగా అనిపిస్తుంటుంది. ఇది సాధారణం. కానీ, వేళితో గ్యాస్ స్టౌవ్ వెలిగించడం ఎప్పుడైనా చూశారా? వేలు పెడితే గ్యాస్ స్టౌ ఆటోమాటిక్‌గా మండటం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు వంట గదిలో గ్యాస్ స్టౌ ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. గ్యాస్ స్టౌ బర్నర్ వద్ద వేలు పెట్టగా.. మరో వ్యక్తి వచ్చి యువకుడు తలపై టవల్ పెట్టి లాగారు. దాంతో అతని వేలు నుంచి అగ్గి పుట్టి.. స్టౌ వెలిగింది. ఈ సీన్‌ను అంతా రికార్డ్ చేసి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ మిరాకిల్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. యువకుడికి ఏమైనా తాంత్రిక శక్తులున్నాయా ఏంటీ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. వీడియోను మీరూ చూసేయండి.

Updated Date - Jan 14 , 2024 | 06:24 PM