Share News

Viral Video: వావ్.. ఈ మెషీన్ భలే ఉందే.. దీంతో ఆడవాళ్లకు ఎంత శ్రమ తగ్గుతుందంటే..!

ABN , Publish Date - Feb 18 , 2024 | 03:26 PM

వంటింట్లో ఆడవాళ్లకు పని భారం తగ్గించే బోలెడు పరికరాలు మార్కెట్లో ఉంటున్నాయి. అయితే ఈ పరికరం కాస్త వెరైటీగా ఉంది.

Viral Video: వావ్.. ఈ మెషీన్ భలే ఉందే.. దీంతో ఆడవాళ్లకు ఎంత శ్రమ తగ్గుతుందంటే..!

టెక్నాలజీ పెరిగాక బోలెడు పనుల భారం తగ్గింది. చేతులు కాళ్లు నొప్పులు పుట్టేలా చేసే ఎన్నో పనులు ఈజీగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా వంటగదిలో ప్రతి దానికి ఒక కొత్త పరికరం ఉంటోంది. అలాంటి పరికరం ఒకటి ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తోంది. ఈ మెషీన్ వంటగదిలో ఉంటే ఆడవాళ్లకు చాలా శ్రమ తగ్గినట్టే అని నెటిజన్లు అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఇది కూడా చదవండి: మనచుట్టూ ఉండే అత్యంత విషపూరితమైన మొక్కలివీ..!


బఠానీలు ప్రతి భారతీయ వంటింట్లో వాడటం జరుగుతూనే ఉంటుంది. తాజా బఠానీలు వంటల్లో వినియోగిస్తే వంట రుచి చాలా బాగుంటుంది. అయితే బఠానీ కాయలు వలవడం మాత్రం కాస్త శ్రమతో కూడుకున్నదే. ఎక్కువ మొత్తం బఠానీ కాయలు వలవాలంటే చేతులు అంతో ఇంతో నొప్పి పుట్టడం కామన్. ఈ సమస్యకు చెక్ పెడుతూ మార్కెట్లో హల్చల్ చేస్తున్న మెషీన్ భలే ఉంది. ఈ మెషీన్లో బఠానీ కాయలు పెడుతుంటే విత్తనాలు వేరుగానూ, పైన పొట్టు వేరుగానూ వెళుతున్నాయి. ఈ మెషీన్ కు 'వెజ్జీ ట్విస్టర్ మాన్యువల్ పీ పీలర్ మెషిన్' అని పేరు పెట్టారు ఈ మెషీన్ వీడియోను outofdecor అనే ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు మహిళలకు ఇది చాలా ఉపయోగం అంటున్నారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2024 | 03:26 PM