Share News

Trending: ఒక్క ద్రాక్ష పండుకోసం రూ. 9 వేలు ఖర్చు పెట్టింది.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఔటే..!

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:41 PM

Viral News: చాలా మంది ప్రజలు ఖరీదైన వస్తువులును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఏదైనా వెరైటీ ఉండాలనే ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి మేరకు వారు ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేస్తారు. తాజాగా ఓ మహిళ ఇదే పని చేసి సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యింది.

Trending: ఒక్క ద్రాక్ష పండుకోసం రూ. 9 వేలు ఖర్చు పెట్టింది.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఔటే..!
Grapes for Rs 9000

Viral News: చాలా మంది ప్రజలు ఖరీదైన వస్తువులును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఏదైనా వెరైటీ ఉండాలనే ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి మేరకు వారు ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేస్తారు. తాజాగా ఓ మహిళ ఇదే పని చేసి సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యింది. ఆమె చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో ఓసారి తెలుసుకుందాం..

దుబాయ్‌లో దలీలా లారీబీ అనే మహిళ 100 గ్రాముల ద్రాక్ష పళ్లను రూ.9 వేలకు కొనుగోలు చేసింది. పైగా.. ఇలా కొనుగోలు చేసిన ఆ పళ్లను తినకూడదని నిర్ణయించుకుంది. ఇందుకు ఒక కారణం కూడా చెప్పుకొచ్చింది ఆమె. సాధారణంగా అయితే ద్రాక్ష పండ్లు కిలో రూ. 100 నుంచి 200 వరకు ఉంటాయి. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్ష పండ్లు జపాన్‌లో పండిస్తారు. వీటిని రూబీ రోమన్ ద్రాక్ష అని కూడా పిలుస్తారు. ఈ పండ్లను.. 92 పౌండ్లు, అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 9 వేలు పెట్టి 100 గ్రాముల ద్రాక్ష పళ్లను కొనుగోలు చేసింది దలీలా లారీబీ. పైగా ఆమె కొనుగోలు చేసిన పండ్లను తినకూడా తినలేదు.

ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. లారీబీ టిక్ టాక్‌లో వీడియో షేర్ చేసింది. ద్రాక్ష గుత్తిని నోటి వద్ద పెట్టుకుని.. దానిని కొనుగోలు చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. తాను కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లను తినేసి, వాటిని కోల్పోవాలనుకోవడం లేదని చెప్పింది. వాస్తవానికి ఆ పండ్లను తినాలని తనకు ఇంట్రస్ట్ లేదట. ఈ ద్రాక్ష పండ్ల గురించి ఎవరో చెబితే.. తాను టేస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యిందట. అందుకే 428 యూఏఈ దిర్హామ్‌లు చెల్లించి(రూ. 9,000) 100 గ్రాముల గ్రేప్స్ కొనుగోలు చేసింది. అంత స్పెషల్ ఏంటో? ఆ పండు టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుని.. తన మిత్రులకు తెలియజేసేందుకు ఆ గుత్తిలో ఒక ద్రాక్షను తిన్నది. ఒక ద్రాక్ష పండును తినగానే.. అందులో ఒక రకమైన సువాసనను పసిగట్టింది. పండ్లను సగానికి కొరికి తిన్నాక.. చాలా రుచిగా అనిపించిందట. అంతేకాదు.. తింటే అయిపోతుందని పక్కకు పెట్టేసిందట లారీబీ.

Updated Date - Jan 17 , 2024 | 05:11 PM