Share News

Viral: వామ్మో.. ఊబర్ డ్రైవర్‌పై రెచ్చిపోయిన మహిళ.. వేడుకున్నా కనికరించకుండా..

ABN , Publish Date - May 24 , 2024 | 05:34 PM

ఊబర్ క్యాబ్ దారి మధ్యలో ఆగిపోవడంతో కోపంతో ఊగిపోయిన మహిళ డ్రైవర్ పై మండిపడింది. అనుకోకుండా ఇలా జరిగిందని డ్రైవర్ వేడుకున్నా, అమర్యాదగా ప్రవర్తిస్తే ఊబర్ కు ఫిర్యాదు చేస్తానని మొత్తుకున్నా ఆమె వినిపించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Viral: వామ్మో.. ఊబర్ డ్రైవర్‌పై రెచ్చిపోయిన మహిళ.. వేడుకున్నా కనికరించకుండా..
Customer lashes out at Uber driver after car break down

ఇంటర్నెట్ డెస్క్: ఊబర్ క్యాబ్ దారి మధ్యలో ఆగిపోవడంతో కోపంతో ఊగిపోయిన మహిళ డ్రైవర్ పై మండిపడింది. అనుకోకుండా ఇలా జరిగిందని డ్రైవర్ వేడుకున్నా, అమర్యాదగా ప్రవర్తిస్తే ఊబర్ కు ఫిర్యాదు చేస్తానని మొత్తుకున్నా ఆమె వినిపించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా (Viral) మారింది. వీడియో చూసిన జనాలు మహిళపై దుమ్మెత్తిపోస్తున్నారు.

వీడియో మొదట్లోనే మహిళ ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించింది. పొరపాటు జరిగిందని అతడు చెబుతున్నా ఆమె కనికరించలేదు. అతడితో అవమానకరంగా మాట్లాడింది. చిన్న చూపు ప్రదర్శించింది. డ్రైవర్ కు మర్యాద లేదని నోరు పారేసుకుంది. మహిళను శాంత పరిచేందుకు డ్రైవర్ అనేక ప్రయత్నాలు చేశాడు. తనకు ఈ వృత్తే జీవనాధారమని చెప్పారు. కానీ ఆమె మాత్రం అతడిని అవమానించింది. చివరకు విసిగిపోయిన డ్రైవర్.. కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పినా ఆమె లెక్కచేయలేదు (Video Of Woman Abusing Uber Driver After Cab Breakdown Divides Internet ).

Viral: ఈ వీడియో చూశాక ఇంకెప్పుడూ నూడుల్స్ తినరు! షాకింగ్ దృశ్యాలు


ఇక వీడియో చూసిన జనాలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటి మనిషి పట్ల కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడం దారుణమని అన్నారు. ఆమెలో జారీ దయా కనిపించట్లేదని కొందరు చెప్పారు. ఇలాంటి వారి విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కొందరు మాత్రం మహిళకు మద్దతుగా నిలిచారు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి కారు ఏ కండీషన్ లో ఉందో నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలని, ఎప్పటికప్పుడు వాహనాన్ని సర్వీసుకు ఇస్తూ రిపేర్లు రాకుండా చూసుకోవాలని అన్నారు. అయితే, డ్రైవర్ తో అంత కటువుగా మాట్లాడటం తప్పని స్పష్టం చేశారు. ఇలా రకరకాల కామెంట్స మధ్య వీడియో వైరల్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - May 24 , 2024 | 05:34 PM