Share News

Viral: ఈ వీడియో చూశాక ఇంకెప్పుడూ నూడుల్స్ తినరు! షాకింగ్ దృశ్యాలు

ABN , Publish Date - May 24 , 2024 | 03:36 PM

మైక్రోస్కోప్‌లో నూడుల్స్ ను పరిశీలిస్తే షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. నూడుల్స్ పై సాధారణంగా కంటికి కనిపించని అనేక సూక్ష్మక్రిములు ఉండటం చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.

Viral: ఈ వీడియో చూశాక ఇంకెప్పుడూ నూడుల్స్ తినరు! షాకింగ్ దృశ్యాలు
Microscopic examination of noodles reveals hidden organisms

ఇంటర్నెట్ డెస్క్: ఇన్‌స్టంట్ నూడుల్స్.. ఈ పేరు చెప్పగానే అనేక మందికి నోరూరిపోతుంది. ఆకలేసినప్పుడల్లా రెండు నిమిషాల్లో దీన్ని తయారు చేసుకుని తినొచ్చు. రుచిలో ఇది టాప్. కానీ, తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి జనాలు షాకైపోతున్నారు. ఈ వీడియో చూశాక జన్మలో నూడుల్స్ తినబుద్ధికాదంటూ కొందరు కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

ఈ వీడియోలో కొందరు నూడుల్స్ ను మైక్రోస్కోప్ లో చూశారు. కంటికి కనిపించని ప్రపంచాన్ని చూపించే మైక్రోస్కోప్ లో నూడుల్స్ పై ఎలాంటి సూక్ష్మక్రిములు ఉంటాయో చూసి జనాలు భయపడిపోతున్నారు. కేవలం ఒక నిమిషం నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియో జనాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నూడుల్స్ పై కంటికి కనిపించని రకరకాల పురుగులు దర్శనమిచ్చాయి. దుమ్మూ ధూళి రేణువులు, బూజు అనేకం ఉన్నాయి. కొందరు ఈ నూడుల్స్ పై ఉన్న పురుగును ట్వీజర్స్ తో బయటకు తీశారు. రోజు మనం తినే నూడుల్స్ ఇలాంటి క్రిములు ఉంటాయనే క్యాప్షన్ తో వారు వీడియోను విడుదల చేశారు (Microscopic Examination Of Instant Noodles Reveals Hidden Organisms).

Viral: ఏ తండ్రికీ రాకూడని కష్టం.. కూతురి ముందు అవమానంతో మోకరిల్లి కన్నీటిపర్యంతం!


ఇది చూసిన జనాలు షాకైపోతున్నారు. ఈ వీడియో చూశాక ఇక నూడుల్స్ మళ్లీ తినగలమా అంటూ కొందరు సందేహం వ్యక్తం చేశారు. అవగాహన లేమితో ఇలాంటి ఫుడ్స్ తింటూ ఎందరు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారో అని మరికొందరు విచారం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు. ఎక్సపైరీ డేట్ దగ్గరపడుతున్న నూడుల్స్ ను వారు మైక్రోస్కోప్ లో చూపి ఉండొచ్చు కదా ? ఇది ఫ్రెష్ నూడుల్స్ అని చెప్పేందుకు రుజువేంటి అని ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ గా మారింది. జనాలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Read Viral and Telugu News

Updated Date - May 24 , 2024 | 04:50 PM