Share News

Collarwali: తుది శ్వాస విడిచిన పెద్దపులి.. నెటిజన్లతో కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!

ABN , Publish Date - May 24 , 2024 | 09:13 PM

కాలర్ వాలీ అనే పెద్ద పులి చివరి క్షణాలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. సూపర్ మామ్ గా పేరు పడ్డ ఈ పులి 2022లో మరణించింది. తన జీవిత కాలంలో ఏకంగా 29 పిల్లల్ని కని పులుల జనాభా పెంచడంలో కీలకపాత్ర పోషించిందీ పులి. ఇది మధ్యప్రదేశ్ లోని పెంచ్ టైగర్ రిజర్వ్ లో ఉండేది.

Collarwali: తుది శ్వాస విడిచిన పెద్దపులి.. నెటిజన్లతో కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!
Collarwali Tiger Final moments

ఇంటర్నెట్ డెస్క్: కాలర్ వాలీ.. జంతు ప్రేమికులకు ఈ పేరు చెప్పగానే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. కాలర్ వాలీ ఓ పెద్ద పులి. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ లో నివసించిన ఈ పులి ఏకంగా 29 మంది పులులకు జన్మనిచ్చి పులుల సంతతి పెరగడంలో కీలకపాత్ర పోషించింది. కాలర్ వాలీ పుణ్యమా అన్ని అక్కడ పులుల సంతతి గణనీయంగా పెరిగింది. 2022లో ఈ పులి చనిపోయినా నెటిజన్లు తాజాగా మరోసారి ఈ పులిని గుర్తు చేసుకుంటున్నారు. పులి చివరి క్షణాలను అనంత్ రూపనగుడి అనే అధికారి షేర్ చేశారు. వీడియోలో (Viral) పులి తుది శ్వాస విడిచిన తీరు చూసి జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

తన చివరి క్షణాలను గుర్తించిన కాలర్ వాలీ ఓ తటాకం వద్దకు చేరుకుని విశ్రమించింది. ఆ తరువాత కొద్ది సేపటికే తుది శ్వాస విడిచింది. ఇదంతా స్థానికులు, టూరిస్టులు అప్పట్లో వీడియోలో రికార్డు చేశారు. కాలర్ వాలీ మరణం అప్పట్లో జంతు ప్రేమికులను శోక సంద్రంలో ముంచేసింది. కాలరీవాలీ 2005లో జన్మించింది. భారత్ లో రేడియో ట్యాగ్ ఉన్న తొలి పులి కూడా ఇదే కావడంతో కాలర్ వాలీ అనే పేరు దానికి స్థిరపడింది. 2008 తొలిసారిగా అది పిల్లల్ని కన్నా అవన్నీ కొద్ది రోజులకే మరణించాయి. ఆ తరువాత మాత్రం కాలర్ వాలీ క్రమం తప్పకుండా పిల్లల్ని కని స్థానికంగా పులుల సంతతి పెంచింది (Video of super moms final moments resurfaces makes internet emotional).

Viral: పబ్లిక్‌గా యువ జంట రోమాన్స్.. జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పిన పోలీసులు


సఫారీలకు వచ్చే సందర్శకులను చూసేందుకు కాలర్ వాలీ ఇష్టపడేది. ఈ క్రమంలో జంతుప్రేమికులు దీనివి పలు ఫొటోలు తీయడంతో కాలర్ వాలీ బాగా పాప్యులర్ అయిపోయింది. 2010 ఏకంగా ఐదుగురు పిల్లల్ని పెట్టి నిపుణులను ఆశ్చర్యపరిచింది. దీంతో, కాలర్ వాలీకి సూపర్ మామ్ అన్న పేరు కూడా స్థిరపడింది. అయితే, వయసు పైబడటంతో పలు అవయవాలు విఫలమై కాలర్ వాలీ 2022 జనవరిలో కన్నుమూసింది. వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి

Read Viral and Telugu News

Updated Date - May 24 , 2024 | 09:16 PM