Share News

Viral: పబ్లిక్‌గా యువ జంట రోమాన్స్.. జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పిన పోలీసులు

ABN , Publish Date - May 24 , 2024 | 08:34 PM

బైక్‌పై ప్రయాణిస్తూ పబ్లిక్ గా చుంబనాల్లో మునిగిపోయిన ఓ జంటకు పోలీసులు భారీ షాకిచ్చారు. తాము చేసిన పనికి వారితోనే క్షమాపణ చెప్పించి ఆ వీడియో నెట్టింట పంచుకున్నారు.

Viral: పబ్లిక్‌గా యువ జంట రోమాన్స్.. జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పిన పోలీసులు

ఇంటర్నెట్ డెస్క్: బైక్‌పై ప్రయాణిస్తూ పబ్లిక్ గా చుంబనాల్లో మునిగిపోయిన ఓ జంటకు పోలీసులు భారీ షాకిచ్చారు. ఆ జంటను అరెస్టు చేశాక వారితోనే క్షమాపణ చెప్పించి ఆ వీడియో నెట్టింట పంచుకున్నారు. రాజస్థాన్ లోని కోటాలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral) మారింది.

ఇటీవల కోటా జిల్లాలో ముహమ్మద్ వసీమ్ అతడి గర్ల్ ఫ్రెండ్ బైక్ పై వెళుతూ అభ్యంతరకర పనులు చేశారు. వెనక ప్రయాణిస్తున్న వాహనదారులు కొందరు ఈ దృశ్యాల్ని వీడియో తీసి నెట్టింట పంచుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. అనేక మంది ఆ యువ జంటపై నిప్పులు చెరిగారు. ఇలాంటి పనులు వారికే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ఇబ్బందులు కలుగజేస్తాయని అన్నారు (Couple arrested in Kota after video of romancing on speeding bike goes viral).

Viral: పెద్దాయనకు చేదు అనుభవం.. ఆస్ట్రేలియాలో మన వంటకాలతో ఫుడ్ స్టాల్ పెడితే..


ఈలోపు పోలీసులు కూడా వీడియోపై దృష్టి సారించారు. వారిని అరెస్టు చేయడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పించారు. తన లాగా చేసి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని వసీం సూచించాడు. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించాడు. ఇదంతా రికార్డు చేసిన పోలీసులు నెట్టింట పంచుకున్నారు. త్వరలో వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఇక యువ జంటకు తగిన శాస్తి జరిగిందని తెలిసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో షార్ట్స్ వీడియోల పేరిట అనేక మంది పబ్లిక్ ప్లేసుల్లో అభ్యంతరకర పనులు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి వారికి పోలీసులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తప్పు చేస్తే పోలీసులు వదిలిపెట్టరన్న భయం ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.

Updated Date - May 24 , 2024 | 08:39 PM