Share News

Viral: పెద్దాయనకు చేదు అనుభవం.. ఆస్ట్రేలియాలో మన వంటకాలతో ఫుడ్ స్టాల్ పెడితే..

ABN , Publish Date - May 24 , 2024 | 06:50 PM

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అనేక దేశాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే, ఆస్ట్రేలియాలో ఓ భారతీయ షెఫ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఆయన చేసిన వంటకాలు రుచి చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Viral: పెద్దాయనకు చేదు అనుభవం.. ఆస్ట్రేలియాలో మన వంటకాలతో ఫుడ్ స్టాల్ పెడితే..
No one visits indian pop up stall in Australia food drive

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అనేక దేశాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే, ఆస్ట్రేలియాలో ఓ భారతీయ షెఫ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఆయన చేసిన వంటకాలు రుచి చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, భారతీయులు మాత్రం ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మరోసారి ట్రై చేయండి అంటూ ప్రోత్సహిస్తున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో (Viral) ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, ఇటీవల సిడ్నీలో జరిగిన ఓ ప్రదర్శనలో ది కలోనియల్ రెస్టారెంట్ కు చెందిన హెడ్ షెఫ్ పాదం వ్యాస్ కూడా ఓ ఫుడ్ స్టాల్ తెరిచారు. తన సుహస్తాలతో చేసిన భారతీయ వంటకాలను అక్కడ ప్రదర్శించారు. నోరూ రించే సమోసాలు, చిక్కెన్ టిక్కా మసాలా వంటివన్నీ చేసి చిన్న చిన్న బాక్సుల్లో పెట్టి స్టాల్ లో ప్రదర్శించారు. స్టాల్‌లో ఆయన కూర్చుని ఎవరైనా వస్తే ఆ ఫుడ్స్ ఇద్దామనుకుని వేయిట్ చేశారు. కానీ, ఆయనకు నిరాశే ఎదురైంది. ఆ వంటకాలపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఇంతలో వర్షం మొదలవుతుండటంతో ఆయన అన్ని సర్దుకుని అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్లిపోయారు. ఈ మొత్తం తతంగం గురించి కాంటినెంటల్ రెస్టారెంట్ వారు రికార్డు చేసి వీడియో పోస్ట్ చేయడంతో భారతీయుల నుంచి పెద్ద ఎత్తున స్సందన వచ్చింది (Desis Feel For This Chef Who Failed To Attract Customers At Australian Food Drive).

Viral: వామ్మో.. ఊబర్ డ్రైవర్‌పై రెచ్చిపోయిన మహిళ.. వేడుకున్నా కనికరించకుండా..


అనేక మంది ఆయనకు మద్దతుగా నిలిచారు. అక్కడ ప్రదర్శిస్తున్న ఫుడ్స్ అన్నింటిల్లో పదామ్ వ్యాస్ వండిన వంటకాలు బెస్టని కొందరు అన్నారు. తమకు అవకాశం ఉండి ఉంటే స్టాల్ లోని ఫుడ్ అంతా తామే తినేసేవారమని కొందరు వ్యాఖ్యానించారు. ఈ విషయమై పాదం వ్యాస్ కూడా మీడియాతో మాట్లాడారు. ఆ రోజు కొంత మందే తన స్టాల్ కు వచ్చారని అన్నారు. అయితే, ఆస్ట్రేలియాలో కేటరింగ్ వ్యవస్థ భిన్నంగా ఉంటుందని, అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 24 , 2024 | 07:00 PM