Share News

Viral News: ఐటెం సాంగ్‌పై స్కూల్ టీచర్ చిందులు.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:40 PM

ఒకప్పుడు ఉపాధ్యాయులు (Teachers) ‘ఇలాగే ఉండాలి’ అనే ట్యాగ్‌లైన్ ఉండేది. పాఠశాలలకు (Schools) వచ్చామా, విద్యార్థులకు విద్యాబోధనలు చెప్పామా, వెళ్లిపోయామా.. అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. ఎవరో ఒకరిద్దరు టీచర్లు విద్యార్థులతో స్నేహంగా మెలిగేవారు తప్ప.. మిగతావాళ్లు స్ట్రిక్ట్‌గా వ్యవహరించేవారు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. విద్యార్థుల పట్ల టీచర్లు స్ట్రిక్ట్‌గా ఉండటం లేదు.

Viral News: ఐటెం సాంగ్‌పై స్కూల్ టీచర్ చిందులు.. వీడియో వైరల్

ఒకప్పుడు ఉపాధ్యాయులు (Teachers) ‘ఇలాగే ఉండాలి’ అనే ట్యాగ్‌లైన్ ఉండేది. పాఠశాలలకు (Schools) వచ్చామా, విద్యార్థులకు విద్యాబోధనలు చెప్పామా, వెళ్లిపోయామా.. అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. ఎవరో ఒకరిద్దరు టీచర్లు విద్యార్థులతో స్నేహంగా మెలిగేవారు తప్ప.. మిగతావాళ్లు స్ట్రిక్ట్‌గా వ్యవహరించేవారు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. విద్యార్థుల పట్ల టీచర్లు స్ట్రిక్ట్‌గా ఉండటం లేదు. స్నేహితుల్లాగా వారితో మెలుగుతున్నారు. సరదా కార్యక్రమాల్లోనూ విద్యార్థులతో కలిసి పాల్గొంటున్నారు. మారిన కాలానికి అనుగుణంగా.. టీచర్లలోనూ ఎంతో మార్పు వచ్చింది. ఇందుకు తాజా ఉందాన్నే ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవచ్చు.


ఒక స్కూల్ విద్యార్థులు తమ క్లాస్ టీచర్ పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ప్రత్యేకంగా నిర్వహించారు. దీంతో సంతోషించిన సదరు మహిళా ఉపాధ్యాయురాలు.. తాను టీచర్ అనే సంగతి మర్చిపోయి, విద్యార్థులతో కలిసిపోయారు. వాళ్లతో సరదాగా కాలం గడపడమే కాదు.. కజ్రా రే అనే హిందీ ఐటం పాటపై డ్యాన్స్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోర్డుపై ‘హ్యాపీ బర్త్ డే రష్మీ మేడమ్’ అని రాసి ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు. టీచర్ డ్యాన్స్ చేస్తుండగా.. ఓ విద్యార్థి ఎరుపు రంగులో ఉండే చున్నీని టీచర్‌పై కప్పాడు. దీన్ని బట్టి చూస్తే.. ఆమె ఎంతో ఓపెన్‌మైండెడ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ సందర్భాన్ని ఎంతలా ఎంజాయ్ చేస్తోందో గ్రహించొచ్చు.

అయితే.. కొందరు నెటిజన్లు మాత్రం ఇందులోనూ తప్పులు వెతకడమే విడ్డూరంగా అనిపిస్తోంది. ఓ ఉపాధ్యాయురాలై ఉండి, ఒక ఐటెం సాంగ్‌పై డ్యాన్స్ వేయడం, అది కూడా విద్యార్థులతో క్లాస్ రూంలోనే చిందులు వేయడం తగునా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఓ టీచర్ ఇలా క్లాస్ రూంలో డ్యాన్స్ చేయడం సబబు కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. టీచర్‌కి మద్దతుగా విమర్శలకు చెక్ పెడుతున్నారు. ఆ టీచర్ అసభ్యకరంగా డ్యాన్స్ చేయలేదని, ఎంతో చక్కగా చేసిందని.. ఓపెన్‌మైండెడ్‌గా ఆలోచించాలని అంటున్నారు. ఇతరులు సంతోషంగా ఉండటాన్ని కొందరు చూడలేదని, టీచర్ అయినంత మాత్రాన డ్యాన్స్ చేసే అర్హత ఆమెకు లేదా? అని నిలదీస్తున్నారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 10:40 PM