Share News

Viral: బీచ్‌లో రెచ్చిపోయిన ఫుల్ స్పీడులో కారు నడిపాడు..చివరకు జరిగింది చూస్తే.. షాకింగ్ వీడియో!

ABN , Publish Date - Apr 01 , 2024 | 03:37 PM

బీచ్‌లో ఫుల్ స్పీడ్‌తో కారు నడిపి ప్రమాదంలో పడ్డాడో డ్రైవర్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: బీచ్‌లో రెచ్చిపోయిన ఫుల్ స్పీడులో కారు నడిపాడు..చివరకు జరిగింది చూస్తే.. షాకింగ్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: కారు, ఎదురుగా ఖాళీగా ఉండే రోడ్లు కనిపిస్తే కొందరు రెచ్చిపోతారు. వాహనాన్ని పరిగెత్తిస్తూ ఫుల్ ఎంజాయ్ చేశామని అనుకుంటారు. కాలం కలిసిరాకపోతే దారుణ ప్రమాదాలు ఎదుర్కొంటారు. అయితే, ఓ వ్యక్తి వెరైటీ కోసమని ఇదే స్టంట్‌ను ఏకంగా బీచ్‌లో ట్రై చేసి భారీ షాక్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral Video) అవుతుండగా నెటిజన్లు కూడా నోరెళ్లబెడుతున్నారు. అదృష్టం బాగుండబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు కానీ లేకపోతే అత్యంత భయానక రీతిలో కన్నుమూసి ఉండేవాడని జనాలు అంటున్నారు.

Agra: భార్య వాట్సాప్ స్టేటస్ చూసి వణికిపోయిన భర్త.. ముంచుకొస్తున్న ప్రమాదం గుర్తించి..


కువైట్‌లోని (Kuwait) అబూ అల్ హసానియాలో శనివారం ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం, ఆ వ్యక్తి తొలుత తన కారును ఫుల్ స్పీడుతో బీచ్‌లో డ్రైవర్ చేశాడు(Driving in Car in Beach) . అదే స్పీడు కొనసాగిస్తూ బీచ్ వెంబడి కారు తిప్పాడు. అయితే, అలల తీవ్రతకు కారు క్రమంగా అదుపుతప్పింది. దీనికి తోడు నేల మీద మట్టి వదులుగా జారిపోతుండటంతో పట్టు తప్పి కారు ఒక్కసారిగా బోల్తో కొట్టింది (Car Tips over). వాహనం ఫుల్ స్పీడు మీద ఉండటంతో ఏకంగా రెండు మూడు పల్టీలు కొట్టింది. కారులోని డ్రైవరేమో భారీ కదుపులకు లోనై ఏకంగా కిటికీలోంచి ఎగిరి సముద్రంలో పడ్డాడు (Driver Thrown In Air). అదృష్టంబాగుండ బట్టి అతడు పెద్ద దెబ్బలేమీ తగలకుండా ప్రాణాలతో బయటపడ్డాడు.


మరోవైపు, ఘటన విషయం తెలిసిన వెంటనే బీచ్‌కు వచ్చిన సిబ్బంది ఫైర్ డిపార్ట్‌మెంట్ సమాచారం అందించారు. కారీను సీజ్ చేశారు. ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. జనాలను మాత్రం ఈ వీడియో నోరెళ్లబెట్టేలా చేస్తోంది. అతివేగం, వాహనాలతో అనవసర స్టంట్లు మంచివి కావని అనేక మంది కామెంట్ చేశారు.

Birthday Cake: బర్త్‌డే వేడుకలో విషాదం.. ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చిన కేక్ తిని 10 ఏళ్ల బాలిక దుర్మరణం

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 03:37 PM