Mukesh Ambani: ముఖేష్ అంబానీని ``కాకా`` అని పిలిచిన వ్యక్తి.. ముఖేష్ ఎంత బాగా స్పందించారంటే..
ABN , Publish Date - Jan 12 , 2024 | 06:22 PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మన దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. పారిశ్రామిక దిగ్గజంగా ప్రఖ్యాతి గడించిన ముఖేష్ ఎలాంటి గర్వమూ లేకుండా ప్రవర్తిస్తుంటారు.

రిలయన్స్ (Reliance) ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మన దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. పారిశ్రామిక దిగ్గజంగా ప్రఖ్యాతి గడించిన ముఖేష్ ఎలాంటి గర్వమూ లేకుండా ప్రవర్తిస్తుంటారు. తాజాగా గుజరాత్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్-2024కు హాజరయ్యారు. ఆ సమయంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
కట్టుదిటట్టమైన భద్రత మధ్య గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ వేదిక వద్దకు ముఖేష్ వెళ్తున్నారు. ఆ సమయంలో చాలా మంది ముఖేష్‌ను చూసేందుకు ఎగబడ్డారు. వారిలో ఒకరు ``ముఖేష్ కాకా`` (Mukesh Kaka) అని అరిచారు. ఆ అరుపు విన్న ముఖేష్ ఒక్క క్షణం అటు వైపు చూశారు. వెంటనే పెద్దగా నవ్వుతూ చేతులు ఊపారు. అనంతరం లోపలికి వెళ్లిపోయారు. ముఖేష్ నవ్వడం, చేతులు ఊపడంతో ప్రజలు పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖేష్ రియాక్షన్ చాలా మందిని ఆకట్టుకుంటోంది.
Indian Railways: ఓహో.. రైళ్లలో టీ అందుకే వేడి నీళ్లలా ఉంటుందా? టీ ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..
@bijjuu11 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.6 లక్షల మందికి పైగా వీక్షించారు. 14 వేల మంది లైక్ చేశారు. ``అది టిపికల్ గుజరాతీ స్మైల్``, ``అది ప్రేమతో కూడిన పలకరింపు``, ``ముఖేష్ చాలా అద్భుతంగా స్పందించారు``, ``ఇలాంటి చిన్న చిన్న విషయాలే వారి గౌరవాన్ని పెంచుతాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.