Share News

Indian Railways: ఓహో.. రైళ్లలో టీ అందుకే వేడి నీళ్లలా ఉంటుందా? టీ ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..

ABN , Publish Date - Jan 12 , 2024 | 04:04 PM

రైళ్లలో రకరకాల ఆహార పదార్థాలతో పాటు టీ, కాఫీ కూడా అమ్ముతుంటారు. వాటి శుభ్రత, రుచి విషయంలో చాలా మంది ఫిర్యాదులు చేస్తుంటారు. అయినా వేరే దారి లేక వాటినే కొనుక్కుంటారు. ముఖ్యంగా రైళ్లలో ఇచ్చే టీ, కాఫీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

Indian Railways: ఓహో.. రైళ్లలో టీ అందుకే వేడి నీళ్లలా ఉంటుందా? టీ ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..

రైళ్లలో (Trains) రకరకాల ఆహార పదార్థాలతో పాటు టీ (Tea in Trains), కాఫీ కూడా అమ్ముతుంటారు. వాటి శుభ్రత, రుచి విషయంలో చాలా మంది ఫిర్యాదులు చేస్తుంటారు. అయినా వేరే దారి లేక వాటినే కొనుక్కుంటారు. ముఖ్యంగా రైళ్లలో ఇచ్చే టీ, కాఫీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే రైళ్లలో ఇక టీ, కాఫీలు తాగడానికే భయమేస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. rohit_mehani అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు (Tea Making in Train).

వైరల్ అవుతున్న వీడియోలో, ఇద్దరు వ్యక్తులు రైలులో కూర్చుని టీ తయారు చేస్తున్నారు. పాలను స్టీల్ క్యాన్‌లో ఉంచి దానిలో నీటిని వేడి చేసే హీటర్ (Heater) రాడ్ పెట్టారు. ఆ హీటర్ సహాయంతో పాలను వేడి చేశారు. ఓ ప్రయాణికుడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ``భారతీయ రైల్వే మీకు ఇలాంటి టీ అందిస్తోంది. వారు ట్యాప్ వాటర్‌ను, హీటర్‌ను ఉపయోగిస్తున్నారు`` అని కామెంట్ చేశాడు. ఆ వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 3 కోట్ల మందికి పైగా వీక్షించారు. 5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

Viral Video: చదవకుండానే జాబ్ సంపాదించడం ఎలా? ఆ టీచర్ చెప్పిన రెండు టిప్స్ ఏంటంటే..

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``భారతదేశంలో పరిశుభ్రత చట్టవిరుద్ధమని మీకు తెలుసా ``, ``అందుకే రైళ్లలో తాగే టీ రుచి వేడి నీళ్లలా ఉంటుంది``, ``ఆహారం విషయంలో రైల్వే తీరు ఎప్పటికీ మారదు``, ``ఇది కచ్చితంగా ఉత్తర భారతదేశంలోనే అయ్యుంటుంది``, ``అది అలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 04:04 PM