Share News

Viral Video: చదవకుండానే జాబ్ సంపాదించడం ఎలా? ఆ టీచర్ చెప్పిన రెండు టిప్స్ ఏంటంటే..

ABN , Publish Date - Jan 12 , 2024 | 03:40 PM

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది చాలా మంది ఉద్యోగుల కల. అందుకోసం ఎంతో తీవ్రంగా శ్రమిస్తారు. కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతారు. ఆన్‌లైన్ క్లాస్‌లు వింటారు. పగలు, రాత్రి పుస్తకాల ముందు కూర్చుని చదువుతుంటారు.

Viral Video: చదవకుండానే జాబ్ సంపాదించడం ఎలా? ఆ టీచర్ చెప్పిన రెండు టిప్స్ ఏంటంటే..

ప్రభుత్వ ఉద్యోగం (Job) సాధించడం అనేది చాలా మంది విద్యార్థుల కల. అందుకోసం ఎంతో తీవ్రంగా శ్రమిస్తారు. కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతారు. ఆన్‌లైన్ క్లాస్‌లు వింటారు. పగలు, రాత్రి పుస్తకాల ముందు కూర్చుని చదువుతుంటారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో (Competitive Exams) మంచి మార్కులు సాధించడం గురించి సీనియర్లను, టీచర్లను సలహాలు అడుగుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో విద్యార్థి తన టీచర్‌ను అలాగే ఓ ప్రశ్న అడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది (Funny Video).

సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ పరీక్ష గురించి ఓ విద్యార్థి తన టీచర్‌ను సలహా అడిగాడు. ``చదవకుండానే SSC JE పరీక్షను క్లియర్ చేయడం ఎలా`` అని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి ప్రశ్నకు ఆ ఉపాధ్యాయురాలు స్పందిస్తూ.. చదవకుండానే SSC JE పరీక్షను క్లియర్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయని చెప్పింది. తన వెనకు ఉన్న బోర్డుపై SSC JE అని రాసి, ఆ తర్వాత దానిని చెరిపేసి.. ``ఇలా క్లియర్ చెయ్యొచ్చు`` అని చెప్పింది. ఆ తర్వాత రెండో మార్గం గురించి చెప్పింది.

``మీ గదిలో ఏసీ ఆన్ చేసి, మంచి దుప్పటి కప్పుకుని, పరుపు మీద బాగా నిద్రపోండి. అప్పుడు మీకు మంచి కలలు వస్తాయి. మీ కలలో ఆ పరీక్షను క్లియర్ చేసుకోండి`` అని నవ్వుతూ చెప్పింది. @ikpsgill1 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 3 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``నాకు రెండో విధానం నచ్చింది``, ``ఈ రహస్యాలను ఎవరికీ చెప్పకండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 03:40 PM