Share News

Viral: 20 నిమిషాల పని.. ఏడాదికి లక్షల్లో లాభాలు.. యువకుడిని సంపన్నుడిగా మార్చిన సైడ్ బిజినెస్!

ABN , Publish Date - Apr 18 , 2024 | 05:03 PM

వేన్నీళ్లకు చన్నీళ్లు అన్నట్టు అదనపు ఆదాయం క్యాండిళ్ల వ్యాపారంలోకి దిగిన ఓ అమెరికా యువకుడు ఊహించని విధంగా సంపన్నుడైపోయాడు. తన ఉత్పత్తుల విక్రాయలు ఏడాదికి రూ.3.8 కోట్ల స్థాయికి చేర్చాడు.

Viral: 20 నిమిషాల పని.. ఏడాదికి లక్షల్లో లాభాలు.. యువకుడిని సంపన్నుడిగా మార్చిన సైడ్ బిజినెస్!

ఇంటర్నెట్ డెస్క్: వేన్నీళ్లకు చన్నీళ్లు అన్నట్టు అదనపు ఆదాయం కోసం ప్రయత్నించిన ఓ యువకుడు ఊహించని విధంగా సంపన్నుడైపోయాడు. తన ఉత్పత్తుల విక్రాయలు ఏడాదికి రూ.3.8 కోట్ల స్థాయికి చేర్చాడు. తనలా ట్రైచేస్తే ప్రతి ఒక్కరూ ఆర్థిక స్థిరత్వం సాధించొచ్చని చెబుతున్న ఈ అమెరికా (USA) యువకుడి ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ (viral) అవుతోంది.

ఫ్లోరిడాలోని (Florida) ఓర్లాండో నగరానికి చెందిన ఫ్రాన్సిస్కో రివెరా గతంలో ఆన్‌లైన్‌లో వేదికల్లో పార్ట టైం‌గా పాఠాలు చెప్పేవాడు. కానీ, కరోనా తరువాత ప్రపంచం సాధారణ స్థితికి చేరుకోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులకు డిమాండ్ తగ్గింది. దీంతో, మరో ఆదాయమార్గం కోసం అతడు యూట్యూబ్‌లో వెతికాడు. ఈ క్రమంలో రివెరాకు ఆర్గానిక్ కాండిళ్ల వ్యాపారం గురించి తెలిసిందే. రకరకాల రంగుల్లో క్యాండిళ్లకు వివిధ రకాల, ఆకర్షిణీయ క్యాప్షన్లు జత చేసి అమ్మితే మంచి లాభాలు కళ్లచూడొచ్చని యూట్యూబ్ వీడియోలు చూసి తెలుసుకున్నాడు. దీంతో, అతడు ప్రింటిఫై సాయంతో ప్రింట్ ఆన్ డిమాండ్ క్యాండిళ్ల వ్యాపారంలోకి దిగాడు. కాన్వా వెబ్‌సైట్ ద్వారా క్యాండిళ్ల కోసం రకరకాల డిజైన్లు సిద్ధం చేసుకుని తన ఉత్పత్తులను ఎట్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచాడు (Side Hustle Helps Man Bring In 3.8 Crore A Year Read).

Viral: వీల్‌చైర్‌లో వృద్ధుడి శవాన్ని బ్యాంకులోకి తీసుకొచ్చిన మహిళ.. తరువాత ఏం చేసిందో తెలిస్తే..


మార్కెట్ తీరు తెన్నులను బాగా పరిశోధించిన ఫ్రాన్సిస్కో రకరకాల ఆకర్షణీయ డిజైన్లలో క్యాండిల్స్‌ను విక్రయించడం ప్రారంభించాడు. అతడి ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉండటంతో తొలి ఏడాదిలోనే రూ.3.8 కోట్లు విలువైన అమ్మకాలు జరిపాడు. చాలా సందర్భాల్లో తాను రెండు గంటలకు మంచి పనిచేయమని అతడు చెప్పాడు. చాలాసార్లు రోజుకు 20 నిమిషాలే పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నాడు. గతేడాది తాను ఒక్కో విక్రయంపైనా 30 నుంచి 50 శాతం లాభం పొందానని చెప్పుకొచ్చాడు. కొంత మొత్తం ఎట్సీ, ప్రింటిఫై సేవలు వినియోగించుకున్నందుకు చెల్లించాల్సి వచ్చిందని చెప్పాడు. గతంలో మునుపెన్నడూ లేనంత సంపాదిస్తున్నానని చెప్పిన అతడు ఈ ట్రిక్‌ను ఎవరైనా ఫాలో అవ్వొచ్చని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 05:13 PM