Share News

Health: వండే ముందు బియ్యం కడుగుతున్నారా? అలా వండితే ఆరోగ్యానికి ఎంత హానికరం అంటే..

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:31 PM

మనకు మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి బియ్యం ప్రధాన ఆహారం. శక్తికి మూలమైన కార్బోహైడ్రేట్లను పుష్కలంగా కలిగి ఉండే బియ్యంలో ఇతర పోషకాలు కూడా ఎన్నో ఉంటాయి. ఫైబర్, మాంగనీస్, సెలీనియం, మెగ్నీషియం, బీ విటమిన్లతో సహా బియ్యంలో ఎన్నో విటమిన్లు, పోషకాలు ఉంటాయి.

Health: వండే ముందు బియ్యం కడుగుతున్నారా? అలా వండితే ఆరోగ్యానికి ఎంత హానికరం అంటే..

మనకు మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి బియ్యం (Rice) ప్రధాన ఆహారం. శక్తికి మూలమైన కార్బోహైడ్రేట్లను పుష్కలంగా కలిగి ఉండే బియ్యంలో ఇతర పోషకాలు కూడా ఎన్నో ఉంటాయి. ఫైబర్, మాంగనీస్, సెలీనియం, మెగ్నీషియం, బీ విటమిన్లతో సహా బియ్యంలో ఎన్నో విటమిన్లు, పోషకాలు ఉంటాయి. అయితే బియ్యాన్ని వండే ముందు చాలా మంది వాటిని నీటితో కడుగుతారు. ఇలా కడగడం వల్ల ఉపయోగం ఏంటి? (Health News)


వైట్ రైస్ అయినా, బ్రైన్ రైస్ అయినా వండే ముందు కచ్చితంగా వాటిని నీటితో కడగాల్సిందే (Washing rice). నీటితో కడగడం వల్ల బియ్యం మెత్తగా, రుచిగా మారతాయి. అంతేకాదు బియ్యంలో ప్రమాదకర ఆర్సెనిక్ (Arsenic) రసాయనం ఉంటుంది. నీటితో కడగడం వల్ల అది పోతుంది. హానికర ఆర్సెనిక్ రసాయనం నేల, నీరు, రాళ్లు, కృత్రిమ ఎరువులు, పురుగుల మందుల్లో ఎక్కువగా ఉంటుంది. వాటి ద్వారా బియ్యంలోకి ప్రవేశిస్తుంది. బియ్యం పండే ప్రాంతాన్ని బట్టి ఆర్సెనిక్ రసాయనం స్థాయిలు ఉంటాయి. ఇది చాలా సులభంగా బియ్యంలోకి ప్రవేశిచగలదు. కొన్ని జంతువులు, మొక్కల్లో ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువగా ఉండడాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు.


ఆర్సెనిక్ విషపూరితం, ఆరోగ్యానికి హానికరం. శరీరంలోకి ఆర్సెనిక్ ఎక్కువగా చేరడం వల్ల ముందు వాంతులు, వికారం మొదలవుతాయి. ఆ తర్వాత జీర్ణ సమస్యలు, గుండె లయ తప్పడం, చర్మం నల్లబడడం, అతిసారం, కడుపునొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. ఆయా సమస్యలకు ఆర్సెనిక్ కారణమని తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది. ఆర్సెనిక్‌ను బియ్యం నుంచి సులభంగా తొలగించే ప్రక్రియ వాటిని బాగా కడగడమే. బియ్యాన్ని కడగకుండా వండుకుంటే మాత్రం ప్రమాదం అని గుర్తుంచుకోండి..

ఇవి కూడా చదవండి..

Shocking: భారత్‌లోనే కాదు.. మలేసియాలోనూ ఇంతేనా?.. న్యూడిల్స్ తింటున్న వ్యక్తికి షాకింగ్ అనుభవం.. ఏం జరిగిందంటే..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వేగంగా వస్తున్న రైలు.. పట్టాలపై ఆగిపోయిన లారీ.. తర్వాతేం జరిగిందంటే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2024 | 12:31 PM