Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వేగంగా వస్తున్న రైలు.. పట్టాలపై ఆగిపోయిన లారీ.. తర్వాతేం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:22 AM

రైలు రాకముందే పట్టాల దాటెయ్యాలనే తొందర్లో చాలా మంది సాహసాలు చేస్తుంటారు. ఒక్కోసారి రైలు వేగాన్ని అంచనా వేయలేక దారుణంగా ప్రాణాలు కోల్పోతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వేగంగా వస్తున్న రైలు.. పట్టాలపై ఆగిపోయిన లారీ.. తర్వాతేం జరిగిందంటే..

సాధారణంగా రైల్వే గేట్ల (Railway Gate) వద్ద చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. రైలు రాకముందే పట్టాల దాటెయ్యాలనే తొందర్లో చాలా మంది సాహసాలు చేస్తుంటారు. ఒక్కోసారి రైలు వేగాన్ని అంచనా వేయలేక దారుణంగా ప్రాణాలు కోల్పోతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే. రైల్వే గేట్ వద్ద పట్టాలపై ఆగిపోయిన ఓ లారీని (Truck) రైలు ఢీకొట్టిన విధానం చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం. ఆ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది (Train hits truck).


dedenmnf అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రైల్వే గేటు మూసి ఉండడం, లోపల పట్టాలపై ఓ లారీ ఆగి ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతలో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు అతి వేగంగా వచ్చి ఆ లారీని బలంగా ఢీకొట్టింది. దెబ్బకు ఆ ట్రక్కు ముక్కలైపోయింది. రైలు చాలా దూరం ఆ ట్రక్కును ఈడ్చుకుని వెళ్లిపోయింది. మంటలు కూడా చెలరేగాయి. ఆ ట్రక్కులో ఎవరైనా ఉండి ఉంటే వాళ్లు ప్రాణాలతో బయటపడడం దాదాపు అసంభవం. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాల గురించి స్పష్టత లేదు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కోట్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 13 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఒక ఐదు నిమిషాలు ఆగి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు``, ``గేటు మళ్లీ తెరిచే సమయం దొరికి ఉండదు``, ``ట్రక్కు డ్రైవర్, రైల్వే గేట్‌మెన్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు``, ``ఇది చాలా ప్రమాదకరం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇది కూడా చదవండి..

Opitcal Illusion: మీకు ఐక్యూ ఎక్కువని మీరు నమ్ముతున్నారా?.. అయితే ఈ ఫొటోలోని మూడు జంతువులను కనిపెట్టండి..!


Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. సడెన్‌గా కదిలిన చెత్త సంచి.. తర్వాత ఏం జరిగిందో చూస్తే..

Updated Date - Apr 08 , 2024 | 11:22 AM