Share News

Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. సడెన్‌గా కదిలిన చెత్త సంచి.. తర్వాత ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Apr 08 , 2024 | 10:15 AM

దొంగల తెలివితేటలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎవరికీ దొరక్కండా ఎలా చోరీ చేయాలో ఫిక్స్ అయి రంగంలోకి దిగుతారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ దొంగ గొప్పగా ప్లాన్ చేసి చోరీ చేశాడు.

Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. సడెన్‌గా కదిలిన చెత్త సంచి.. తర్వాత ఏం జరిగిందో చూస్తే..

దొంగతనం (Theft) చేసే వ్యక్తులు రకరకాల టెక్నిక్‌లు ఉపయోగిస్తుంటారు. ఎక్కడ, దేనిని దొంగిలించాలనుకున్నారో ఫిక్స్ అయ్యాక దానికి తగినట్టు స్కెచ్ వేస్తారు. ఎవరికీ దొరక్కండా ఎలా చోరీ చేయాలో ఫిక్స్ అయి రంగంలోకి దిగుతారు. దొంగల (Thief) తెలివితేటలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ దొంగ గొప్పగా ప్లాన్ చేసి చోరీ చేశాడు. అయితే అతడి నిర్వాకం మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


ppv_tahoe అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ నల్లటి చెత్త సంచి (Garbage bag) కనిపిస్తోంది. ఉన్నట్టుండి ఆ చెత్త సంచి కదలడం మొదలుపెట్టింది. ఆ సంచిలో ఒక వ్యక్తి ఉన్నాడు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి నల్లటి సంచిలోకి దూరిపోయాడు. ఆ సంచి వేసుకుని నడుచుకుంటూ వెళ్లి డోర్ దగ్గర ఉన్న పార్సిల్‌ను తీసుకుని వెనక్కి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు ఆ ఇంట్లో అమర్చిన సీసీటీవీ కేమెరాలో రికార్డు అయ్యాయి.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 13 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఇది గొప్ప ఆలోచన. ఆ పార్సిల్ అతడికి దక్కాల్సిందే``, ``ఏదో సినిమాలో చూసి కాపీ కొట్టినట్టున్నాడు``, ``దొంగలకు ఇది అవసరమైన యూనీఫామ్``, ``సీసీటీవీకి దొరికినా అతడెవరో కనిపెట్టడం కష్టం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ ట్రిక్ ఏదో కొత్తగా ఉందే.. తాళం అక్కర్లేకుండా స్కూటీని ఎలా స్టార్ట్ చేశాడో చూడండి..

Viral News: మానవత్వం అంటే ఇదే.. భూకంప ప్రమాదం వేళ శిశువులను కాపాడేందుకు నర్సులు ఏం చేశారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2024 | 10:22 AM