Share News

Viral Video: ఈ ట్రిక్ ఏదో కొత్తగా ఉందే.. తాళం అక్కర్లేకుండా స్కూటీని ఎలా స్టార్ట్ చేశాడో చూడండి..

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:11 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జుగాడ్ వీడియోలు, వాటిల్లో ఉపయోగించే క్రియేటివిటీ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Viral Video: ఈ ట్రిక్ ఏదో కొత్తగా ఉందే.. తాళం అక్కర్లేకుండా స్కూటీని ఎలా స్టార్ట్ చేశాడో చూడండి..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని విపరీతంగా వైరల్ (Viral Video) అవుతున్నాయి. ముఖ్యంగా జుగాడ్ వీడియోలు, వాటిల్లో ఉపయోగించే క్రియేటివిటీ చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Jugaad Videos).


nitya_tech అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో స్కూటీకి (Scooty) ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. హోండా యాక్టివా స్కూటీని తాళంతో (Key) కాకుండా ఫింగర్ ప్రింట్‌తో (Finger print) స్టార్ట్ చేసేలా రూపొందించారు. స్కూటీకి ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ అమర్చారు. కీ ఎక్కడైనా పోయినా ఆ స్కూటీ స్టార్ట్ అయిపోతుంది. మళ్లీ ఆ సెన్సార్‌ను తాకినపుడు స్కూటీ ఇంజిన్ ఆగిపోతుంది. ఈ ట్రిక్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 32 లక్షల మందికి పైగా వీక్షించారు. 73 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బ్యాటరీ అయిపోతే మీరు ఏమి చేస్తారు?``, ``వర్షంలో ఇది ఎలా పని చేస్తుంది``, ``ట్రాఫిక్ జామ్‌లో దీనిని స్టార్ట్ చేసేటప్పటికీ వెనుక వారికి బీపీ వచ్చేస్తుంది``, ``తాళం మర్చిపోయినా ఫర్వాలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: మానవత్వం అంటే ఇదే.. భూకంప ప్రమాదం వేళ శిశువులను కాపాడేందుకు నర్సులు ఏం చేశారో చూడండి..

Viral: ఈ మాత్రం దానికి స్టేడియంకు వెళ్లడం ఎందుకు? ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన యువతి ఏం చేసిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 01:11 PM