Share News

Viral News: మానవత్వం అంటే ఇదే.. భూకంప ప్రమాదం వేళ శిశువులను కాపాడేందుకు నర్సులు ఏం చేశారో చూడండి..

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:40 PM

తైవాన్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నర్సులు తమ విధులను కొనసాగించారు.

Viral News: మానవత్వం అంటే ఇదే.. భూకంప ప్రమాదం వేళ శిశువులను కాపాడేందుకు నర్సులు ఏం చేశారో చూడండి..

తైవాన్‌లో (Taiwan) ఇటీవల సంభవించిన భారీ భూకంపం (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగల్చింది. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నర్సులు (Nurse Video) తమ విధులను కొనసాగించారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టారు (Viral Video).


భూకంప సమయంలో ఆ ఆస్పత్రి భవనం కంపించడం ప్రారంభించింది. అప్పుడే పుట్టిన పిల్లలను ఊయలలలో వేసి ఓ గదిలో ఉంచారు. భూకంప సమయంలో నర్సులు హడావుడిగా ఆ గదిలోకి పరుగులు పెట్టారు. భూకంప తీవ్రతకు ఊగిపోతున్న ఊయలలను నలుగురూ కలిసి గట్టిగా పట్టుకున్నారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పారిపోవాలనే ఆలోచన చేయకుండా పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ దృశ్యాలో గదిలో అమర్చిన సీసీటీవీ కెమేరాల్లో రికార్డు అయ్యాయి (Nurses Protect Babies).


@IamNishantSh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2.3 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోలోని నర్సుల ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``వాళ్లు దేవతా మూర్తులు``, ``ఆ వీర మహిళలకు వందనం``, ``వాళ్లు తమ ప్రాణాల గురించి పట్టించుకోలేదు``, ``ఇలాంటి మనుషులు చాలా అరుదుగా`` ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇది కూడా చదవండి..

Viral: ఈ మాత్రం దానికి స్టేడియంకు వెళ్లడం ఎందుకు? ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన యువతి ఏం చేసిందంటే..


Opitcal Illusion: మీ కళ్లు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలో కత్తెరను కనిపెట్టండి..!

Updated Date - Apr 05 , 2024 | 12:40 PM