Share News

Viral Video: విమానంలో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్!

ABN , Publish Date - Apr 26 , 2024 | 08:00 PM

ఓ పైలట్ తన ప్రేయసి అయిన ఎయిర్‌హాస్టస్‌కు విమానంలో ప్రపోజ్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని అతడు కోరగా ఆమె కూడా సంబరంతో అంగీకరించింది. ఎల్ఓటీ పాలిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

Viral Video: విమానంలో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్!

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమికుల మధ్య పెళ్లి ప్రస్తావన ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే, ఈసారి ఓ పైలట్ తన ప్రేయసి అయిన ఎయిర్‌హోస్టెస్‌‌కు విమానంలో ప్రపోజ్ చేశాడు! ఫ్లైట్ బయలుదేరే ముందు అతడు తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రేయసిని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

ఎల్ఓటీ పాలిష్ ఎయిర్‌లైన్స్‌కు (LOT Polish Airlines) చెందిన కెప్టెన్ కాన్రాడ్ తన ప్రేయసికి ఇలా వినూత్న రీతిలో ప్రపోజ్ చేశాడు. అతడి గర్ల్ ఫ్రెండ్ అదే విమానయాన సంస్థలో ఎయిర్‌హోస్టస్‌గా పనిచేస్తోంది. ఇటీవల వారిద్దరికీ ఒకే విమానంలో డ్యూటీ పడింది. అయితే విమానం బయలుదేరే ముందు కెప్టెన్ ప్లేన్‌లోని మైక్రోఫోన్‌ ద్వారా తన మనసులో మాట అనౌన్స్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రేయసిని కోరాడు. ఆమె కూడా సంబరపడిపోతూ అతడితో పెళ్లికి అంగీకరించింది (Pilots emotional proposal to flight attendant mid-air will tug at your heartstrings).

Viral: జాబ్‌కు రాజీనామా.. చివరి రోజున బాస్‌కు ఎలాంటి ఝలక్ ఇచ్చాడో చూస్తే..


ఇది విన్న విమాన ప్రయాణికులు అందరూ ఆ ప్రేమికులకు శుభకాంక్షలు చెబుతూ చప్పట్లు కొట్టారు. ఈ వీడియోను ఎయిర్‌లైన్స్ సంస్థ స్వయంగా నెట్టింట పంచుకుంది. వాళ్లిద్దరు ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారని తెలిపింది. ఇంతకు మించి మనసుకు హత్తుకునే ఉదంతం మరొకటి ఉండదని వ్యాఖ్యానించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Read Viral and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 08:11 PM