Share News

The Right Age: పిల్లవాడు ఒంటరిగా నిద్రించడానికి సరైన వయస్సు ఏది?

ABN , Publish Date - Jan 20 , 2024 | 04:45 PM

ఇలా చేయడం వల్ల పిల్లలు నెమ్మదిగా ఒంటరిగా నిద్రపోయేందుకు అలవాటు పడతారు. ఇద్దరు తోబుట్టువులు ఉంటే కనుక ఇది చాలా సులభం అవుతుంది.

The Right Age: పిల్లవాడు ఒంటరిగా నిద్రించడానికి సరైన వయస్సు ఏది?
The Right Age

బిడ్డలు పుట్టాకా వాళ్ళను అపురూపంగా తల్లి పక్కనే పొదుముకుని పడుకుంటుంది. పాలు తాగే పిల్లలు తల్లి పక్కనే కాస్త ఊహ వచ్చే వరకూ పడుకుంటారు. వేరే గదిని వారికి కేటాయించడం అనే విషయానికి వస్తే.. తల్లిదండ్రులు చాలా పెద్ద విషయంగా భావిస్తారు. ప్రత్యేకమైన గదిని వారికి కేటాయించడం అనేది పిల్లల వయసు మీద ఆధారపడి ఉంటుంది. దీనికి సరైన సమయం ఎప్పుడు అనేది చూద్దాం.

పిల్లలకు ప్రత్యేక గదిని ఇవ్వడం అనే విషయం మీద తల్లిదండ్రుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. అయితే కొందరు మాత్రం తమ బిడ్డ వేరేగా పడుకోవాలని ఆశిస్తారు. ఇది ఎందుకు అంటే పిల్లల్లో స్వతంత్ర భావాన్ని పెంపొందించాలనే ఆలోచనతో వారిని ఒంటరిగా నిద్రపోయేలా చేస్తారు. ఇందులో మరి కొందరు తల్లిదండ్రులు పిల్లలు తమతోనే పడుకోవాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. ఇలా చేయడం వల్ల మానసికంగా బలంగా తయారవుతారని నమ్ముతారు.

పిల్లలను విడిగా నిద్రపోవడానికి సరైన సమయం ఏది?

పిల్లలకు ఒక సంవత్సరం వయసు రాగానే వారికంటూ వేరే మంచాన్ని, తల్లిదండ్రుల గదిలోనే ఏర్పాటు చేసి, అక్కడ నిద్రపోయే అలవాటును నెమ్మదిగా చేయాలి. పిల్లలకి ఐదేళ్ల వయసు వచ్చాకా, ప్రత్యేక గదిలో నిద్రపోయేలా చూడాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు నెమ్మదిగా ఒంటరిగా నిద్రపోయేందుకు అలవాటు పడతారు. ఇద్దరు తోబుట్టువులు ఉంటే కనుక ఇది చాలా సులభం అవుతుంది. ఒంటరిగా నిద్రపోవాలంటే ఉండే భయం కూడా తగ్గుతుంది. ఇదంతా నెమ్మదిగా వారికి అలవాటు చేయాలి కానీ అకస్మాత్తుగా చేయకూడదు.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యానికి ఖాళీ కడుపుతో వాల్‌నట్స్ తిని చూడండి..!


పిల్లలు అంతా ఒకేలా ఉండకపోవచ్చు..

ప్రేమతో కూడిన రక్షణను అందించడం ద్వారానే పిల్లల్లో ధైర్యమైన ఆలోచనలను తల్లిదండ్రులు అందీయగలరు. అది నేర్పాల్సింది తల్లిదండ్రులే. ఇదంతా ఒక్కరోజులో పిల్లలకు అలవాటు కాదు. నెమ్మదిగా అలవాటు కావాలి.

గది ఎలా ఉండాలి..

గది శుభ్రంగా, విశాలంగా ఉండేలా చూడాలి. అలాగే గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. తల్లిదండ్రుల పడక గదికి, పిల్లల రూమ్‌కి కాస్త దూరమే ఉండాలి. పిల్లల గది వాతావరణం ప్రశాంతంగా, ఉష్ణోగ్రతకి తగినట్టుగా, చల్లగా ఉండేలా చూడాలి. గదిలో ఆడుకునేందుకు పిల్లలకు నచ్చేవిధంగా ఆట బొమ్మలతో అలంకరించడం బావుంటుంది.

పక్కనే ఉండండి..

పిల్లవాడు పడుకునేంత వరకూ వాళ్ల దగ్గరే ఉండి పడుకున్నారు అని నిర్థారించుకున్నాకనే బయటకు రావాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు అమ్మానాన్నలు పక్కనే ఉన్నారనే భరోసా ఉంటుంది. వారు ధైర్యంగా పడుకుంటారు.

Updated Date - Jan 20 , 2024 | 04:45 PM