Share News

Eat Walnuts : శీతాకాలంలో గుండె ఆరోగ్యానికి ఖాళీ కడుపుతో వాల్‌నట్స్ తిని చూడండి..!

ABN , Publish Date - Jan 20 , 2024 | 03:36 PM

ఖాళీ కడుపుతో వాల్ నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సహా అవసరమైన పోషకాలు శరీరానికి అంది, శక్తికి, ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

Eat Walnuts : శీతాకాలంలో గుండె ఆరోగ్యానికి  ఖాళీ కడుపుతో వాల్‌నట్స్ తిని చూడండి..!
Eat Walnuts :

చలికాలం వచ్చిందంటే ఆరోగ్యానికి సపోర్ట్ చేసే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో వాల్ నట్స్ ముందుంటాయి. ఖాళీ కడుపుతో వాల్ నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అంది, శక్తికి, పూర్తి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో వాల్ నట్స్ గురించి మరింత తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల కలిగే ఆరు ప్రయోజనాలు..

1. డయాబెటిస్ నియంత్రణ... వాల్‌నట్‌లు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

2. గుండె ఆరోగ్యం.. వాల్‌నట్స్‌లో అధిక స్థాయిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి, వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి, వాపు తగ్గుతుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: చలికాలంలో పెరుగు తోడుకోవాలంటే ఇలా చేసి చూడండి..!


3. మెదడు ఆరోగ్యం.. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మెదడు ఆరోగ్యానికి మంచిది. వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తినిపెంచి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

4. బరువు నిర్వహణ.. క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాల్‌నట్‌లను ఖాళీ కడుపున తింటే బరువును తగ్గించడంలో సహాయపడుతాయి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృత్తులు, ఫైబర్ రోజంతా అతిగా తినే అలవాటును తగ్గిస్తాయి.

5. జీర్ణ ఆరోగ్యం.. వాల్‌నట్‌లు డైటరీ ఫైబర్‌కి మంచి మూలం, ఇది జీర్ణ ఆరోగ్యానికి సహాకరిస్తుంది. ప్రేగు కదలికలను ఉత్తేజపరుస్తాయి, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.

6. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు... వాల్‌నట్స్‌లో పాలీఫెనాల్స్, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. వాల్ నట్స్ తింటే శరీరం ఈ యాంటీ ఆక్సిడెంట్లను సమర్ధవంతంగా గ్రహిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 20 , 2024 | 03:36 PM