Share News

Winter Season : చలికాలంలో పెరుగు తోడుకోవాలంటే ఇలా చేసి చూడండి..!

ABN , Publish Date - Jan 20 , 2024 | 02:28 PM

బయట చల్లని వాతావరణం వల్ల కావచ్చు, లేదా చల్లగా కాకుండా వేడిగా తినాలనే కోరిక వల్ల కావచ్చు, పెరుగు తినడం అంటే అంత ఇష్టాన్ని చూపించరు. కానీ పెరుగు గడ్డలా గట్టిగా తోడుకుంటే మాత్రం చక్కగా లాగించేస్తారు.

Winter Season : చలికాలంలో పెరుగు తోడుకోవాలంటే ఇలా చేసి చూడండి..!
eat curd

చలికాలంలో పెరుగు పేరుకోదు. గదిలో చల్లని వాతావరణం వల్ల కావచ్చు. శీతాకాలం గాలి పొడిగా ఉండటం వల్ల కావచ్చు, పెరుగు సరిగ్గా తోడుకోదు. సరిగా తోడుకోని పెరుగుతో అన్నం తినాలంటే చాలా మందిలో అసహనంగా అనిపిస్తుంది. బయట చల్లని వాతావరణం వల్ల కావచ్చు, లేదా చల్లగా కాకుండా వేడిగా తినాలనే కోరిక వల్ల కావచ్చు, పెరుగు తినడం అంటే అంత ఇష్టాన్ని చూపించరు. కానీ పెరుగు గడ్డలా గట్టిగా తోడుకుంటే మాత్రం చక్కగా లాగించేస్తారు. దీనికోసం సులభంగా పెరుగును తోడు వేయడానికి ఈ చిట్కాలను ట్రై చేయండి.

శీతాకాలంలో పెరుగు తోడు పెట్టడానికి గోరు వెచ్చని పాలను తీసుకోవాలి. చల్లటి పాలలో తోడు వేసినా అది పాలలానే మిగిలిపోతుంది. అందుకని కాస్త గోరువెచ్చని పాలనే తీసుకుంటే తోడు వేసి మూత పెట్టి కాస్త వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. ఇలా తోడు వేసిన ఆరుగంటల సమయంలోనే పెరుగు గట్టిగా తోడుకుంటుంది. కమ్మని వాసనతో రుచికరంగా మారుతుంది. పెరుగు మన భోజనంలో ఒక భాగం, పెరుగు ఈ చల్లని వాతావరణంలో తోడుకోవాలంటే..

1. శీతాకాలంలో పెరుగు గట్టి పడదు. దీనికి చాలా సమయాన్ని తీసుకుంటుంది. ఒక్కోసారి ఎంత సమయం చూసినా అలా పాలలానే ఉంటుంది. త్వరగా తోడుకోదు. గడ్డ పెరుగు కావాలి అంటే మాత్రం కాస్త శ్రద్ధ పెట్టి తోడు పెట్టాల్సిందే..

2. పాలను తోడు పెట్టిన తర్వాత ఆ గిన్నె మీద మరో గిన్నె లేదా డబ్బాను బోర్లించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా పాటు తోడుకుంటాయి.

3. పాలను తోడు పెట్టే ముందు వేడి చూసుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టాలి. ఎక్కువ వేడి ఉండగా తోడు పెడితే పెరుగు రుచి ఉండదు. పైగా నీళ్ళు పైకి తేలి వెగటు రుచితో వాసన వస్తుంది.

ఇది కూడా చదవండి: వావ్... నిమ్మకాయను రోజూ తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..!


4. పాలను తోడు పెట్టడానికి గట్టిగా తోడుకున్న పెరుగునే తోడుకు వాడాలి. ఇలా చేయడం వల్ల తోడుకునే పెరుగు కూడా గడ్డలా వస్తుంది.

5. పాలను తోడు పెట్టిన గిన్నెను పదే పదే కదిలించి చూడకూడదు. ఇలా చేయడం వల్ల పాలు పెరుగు కావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే పైన నీళ్ళు తేరుకునే అవకాశం కూడా ఉంది.

6. పాలను తోడు పెట్టిన తర్వాత అందులో చిన్న ఎండు మిరపకాయను వేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పాలు త్వరగా తోడుకోవడమే కాదు, పెరుగు కూడా గట్టిగా వస్తుంది.


7. పాలను తోడు పెట్టిన గిన్నె చుట్టూ వేడిగా ఉండేలా గుడ్డని కానీ వస్త్రాన్ని కానీ కట్టినా కూడా లోపలికి గాలి చొరబడకుండా త్వరగా తోడుకుంటుంది.

8. పాలను తోడుపెట్టే గిన్నె పాలకు సరిపడా ఉండాలి. పెద్దగా ఉంటే శీతాకాలంలో చల్లదనానికి పెరుగు తయారు కాదు. పాలను తోడు పెట్టడానికి మట్టి పాత్రలను ఉపయోగిస్తే పెరుగు రుచిగా ఉంటుంది. ఈ చిట్కాలతో శీతాకాలంలో కూడా గడ్డ పెరుగుతో భోజనం చేయచ్చు. ట్రై చేసి చూడండి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 20 , 2024 | 02:28 PM