Share News

Viral: ఫ్రెండేకదా అని పిల్లితో పరాచకాలు.. చిలకకు ఎలాంటి షాక్ తగిలిందంటే..

ABN , Publish Date - May 25 , 2024 | 05:47 PM

నిద్రపోతున్న పిల్లిని డిస్టర్బ్ చేసిన చిలక జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: ఫ్రెండేకదా అని పిల్లితో పరాచకాలు.. చిలకకు ఎలాంటి షాక్ తగిలిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: పిల్లులు, పక్షులు ఒకే చోట పెరిగినప్పుడు వాటి జన్మ వైరం మర్చిపోతాయి. కలిసి మెలిసి ఉంటాయి. కానీ పిల్లులు మాత్రం తమ అసలు లక్షణాన్ని పూర్తిగా కోల్పోవు. ఏమాత్రం తేడా వచ్చినా పంజా విసిరి చావు దెబ్బతీస్తాయి. ఓ చిలక ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకుంది. పిల్లితో పరాచకాలు ఆడకూడదని జీవితంలో మర్చి పోలేని విధంగా గుణపాఠం నేర్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.

సాధారణంగా పిల్లులు ఏకాంతంగా ఉండేందుకే ఇష్టపడతాయి. ఇతరుల పొడ వాటికి గిట్టదు. ఈ కారణంగానే పెంపుడు పిల్లులు తమ యజమానులతో అంటీముట్టనట్టుగా ఉంటాయి. పెంపుడు కుక్కల్లా మరీ రాసుకుపూసుకుని తిరగవు. ఓ చిలకకు ఇవేమీ తెలియక దెబ్బైపోయింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, పెంపుడు పిల్లి, చిలక ఒకే ఇంట్లో ఉంటున్నాయి. టైంకు అన్ని యజమానులే చూస్తుండటంతో అవి వాటి మధ్య ఉన్న జన్మశత్రుత్వాన్ని దాదాపుగా మర్చిపోయాయి. ఈ క్రమంలో చిలక ఓ రోజు నిద్రిస్తున్న పిల్లితో పరాచకాలు ఆడింది (Parrot, disturbs cat which teaches it an unforgettable lesson).

Viral: వామ్మో ఇదేం దారుణం! కదులుతున్న లారీలో ప్రమాదకరంగా చోరీ..


పిల్లి తన మానాన తాను నిద్రపోతుంటే పక్కనే చేరి గెంతులేస్తూ అల్లరి చేసింది. పిల్లి మీద కూడా పడి తెగ డిస్టర్బ్ చేసింది. పిల్లి మన ఫ్రెండేలే అన్నట్టు రెచ్చిపోయింది. కానీ, చిలక అల్లరి భరించలేకపోయిన పిల్లి తన సహజలక్షణాన్ని బయటపెట్టింది. తెగ గెంతుతున్న చిలకపై పలుమార్లు పంజా విసిరిరింది. దీంతో, ఎల్లకెలా పడ్డ చిలక ఆ దెబ్బలకు తాళలేక లబోదిబోమంది.

ఇక వీడియో చూసిన జనాలు షాకైపోతున్నారు. పిల్లి ఆకలితో లేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చిలకను అక్కడిక్కడే గుటుక్కున మింగేసేదని కొందరు అన్నారు. వేటాడే లక్షణం నరనరానా జీర్ణించుకుపోయిన పిల్లితో పరాచకాలు అంటే చావుతో చెలగాటమాడినట్టేనని అన్నారు. చిలకకు పిల్లి రేంజ్ ఏంటో బోధపడి ఉంటుందని కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 25 , 2024 | 05:53 PM