Share News

Optical Illusion Challenge: ఇందులో జిరాఫీ ఉంది.. దమ్ముంటే కనిపెట్టండి..!

ABN , Publish Date - Jan 28 , 2024 | 08:02 PM

Optical Illusion: శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఔట్ డోర్ వ్యాయామాలు చేస్తుంటాం. సమతుల ఆహారం తీసుకుంటాం. మరి మనసును ఎలా చురుకుగా ఉంచుకోవాలి? మానసిక ఆరోగ్యంగా ఉండటానికి ఏం కావాలి? ఏం చెయ్యాలి? అంటే దీనికి కూడా కొన్ని వ్యాయామాలు ఉన్నాయి.

Optical Illusion Challenge: ఇందులో జిరాఫీ ఉంది.. దమ్ముంటే కనిపెట్టండి..!
Optical Illusion

Optical Illusion: శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఔట్ డోర్ వ్యాయామాలు చేస్తుంటాం. సమతుల ఆహారం తీసుకుంటాం. మరి మనసును ఎలా చురుకుగా ఉంచుకోవాలి? మానసిక ఆరోగ్యంగా ఉండటానికి ఏం కావాలి? ఏం చెయ్యాలి? అంటే దీనికి కూడా కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైంది.. మెదడుకు ఫుల్ వర్క్ చెప్పే ఫజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు, మ్యాథమెటిక్ టిక్స్ అని చెప్పుకోవచ్చు. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్ పిక్స్ టాప్ ప్లేస్‌లో ఉంటాయి. ఇవి మెదడుకు మంచి ఎక్సర్‌సైజ్‌ను ఇస్తాయి. అందుకే.. ప్రస్తుతం ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్ టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా అదిరిపోయే ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో అందమైన సూర్యాస్తమయం, ఎర్రటి మబ్బులు, పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. అలాగే ఒక పరదా లాంటి ఆకారం కూడా కనిపిస్తోంది. ఈ బ్యూటీఫుల్ ఫోటోలో ఓ అందమైన జిరాఫీ దాక్కుని ఉంది. చెట్లు, మబ్బులు, పరదా, సూర్యుడితో పాటు.. జిరాఫీ కూడా ఫోటోలో ఉంది. చాలా తెలివిగా అది దాక్కుని ఉంది. దానిని కనిపెట్టడం అంత ఈజీ ఏమీ కాదు. అయితే, ఇక్కడ ఇదే మీకిచ్చే టాస్క్. కేవలం 10 సెకన్లలో ఆ జిరాఫీ ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. అలా కనిపెడితే.. నిజంగా మీ బ్రెయిన్ చాలా షార్ప్ అని భావించొచ్చు. అలాగే, మీ కంటి చూపు కూడా పర్‌ఫెక్ట్‌ అనుకోవచ్చు.

ఏంటీ కనిపించలేదా? అయితే కింద చూసేయండి..

ఈ ఫోటోలో జిరాఫీ ఎక్కడుందో మీకు కనిపించలేదా? క్షుణ్ణంగా వెతికినా జిరాఫీ జాడ దొరకలేదా? అయితే, మరేం పర్వాలేదు. జిరాఫీ ఎక్కడుందో పేర్కొంటూ ఫోటోపై రౌండప్ చేయడం జరిగింది. కింది ఫోటోలో జిరాఫీ ఎక్కుడుందో చూడొచ్చు.

Find-Giraffe-in-Optical-Illusion.jpg

Updated Date - Jan 28 , 2024 | 08:28 PM