Share News

Namrata Shirodkar Birthday: నమ్రత బర్త్‌డే వేడుకల్లో నారా బ్రాహ్మణి సందడి..

ABN , Publish Date - Jan 24 , 2024 | 06:20 PM

Namrata Shirodkar Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ పుట్టిన జనవరి 22న తన పుట్టిన రోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఆమె బర్త్‌డే చేసుకన్నారు. నర్మద బర్త్‌డే పార్టీకి సెలబ్రిటీలతో పాటు.. మరో కీలక వ్యక్తి కూడా హాజరయ్యారు.

Namrata Shirodkar Birthday: నమ్రత బర్త్‌డే వేడుకల్లో నారా బ్రాహ్మణి సందడి..
Namrata Shirodkar Birthday

Namrata Shirodkar Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ పుట్టిన జనవరి 22న తన పుట్టిన రోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఆమె బర్త్‌డే చేసుకన్నారు. నర్మద బర్త్‌డే పార్టీకి సెలబ్రిటీలతో పాటు.. మరో కీలక వ్యక్తి కూడా హాజరయ్యారు. ఆమె.. నందమూరి బాలకృష్ణ కూతురు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి. నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. నమ్రతతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కాగా, మహేష్ బాబు ప్రస్తుతం జర్మనీలో ఉండగా.. సోషల్ మీడియా వేదికగా నమ్రతకు బర్త్‌డే విషెష్ చెప్పారు. ఇక నమ్రత తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుని.. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. ఈ బర్త్‌డే వేడుకకు మహేష్ బాబు సిస్టర్స్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, నారా బ్రాహ్మణ్, పలువురు ఫ్యాషన్ డిజైనర్స్, ఫ్రెండ్స్ హాజరయ్యారు. వీరందరితో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

Updated Date - Jan 24 , 2024 | 06:26 PM