Share News

Viral: నేను ధోనీని.. అర్జెంట్‌గా రూ.600 కొట్టు అంటూ మెసేజ్.. ఇన్‌స్టా యూజర్‌కు షాక్!

ABN , Publish Date - Apr 25 , 2024 | 08:56 PM

ధోనీ పేరిట సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారు. నేను ధోనీని.. ఇబ్బందుల్లో ఉన్నా రూ.600 పంపించు అనే మెసేజ్‌తో డబ్బులు దోచుకునేందుకు ట్రై చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు పెట్టిన ఓ మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Viral:  నేను ధోనీని.. అర్జెంట్‌గా రూ.600 కొట్టు అంటూ మెసేజ్.. ఇన్‌స్టా యూజర్‌కు షాక్!

ఇంటర్నెట్ డెస్క్: సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త వ్యూహంతో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా ధోనీ పేరిట వారు ఓ నెటిజన్‌ను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. నేరగాళ్లు తనకు పంపించిన మెసేజీని సదరు నెటిజన్ నెట్టింట పంచుకోవడంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

చిక్కుల్లో పడ్డ ధోనీ చేబదులు కోసం చేయిచాచినట్టు నమ్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. ‘‘నేను ధోనీని, రాంచీలో చిక్కుకుపోయా. నా ప్రైవేటు అకౌంట్‌ను మెసేజ్ చేస్తు్న్నా. నేను రాంచీ సరిహద్దుల్లో ఉన్నా. వాలెట్ ఇంట్లోనే మర్చిపోవడంతో ఇక్కడ ఇరుక్కుపోయా. రూ.600 ఫోన్ పే చేయి. బస్సులో ఇంటికెళ్లాక నీకు డబ్బు వాపసు ఇచ్చేస్తా’’ అంటూ నిందితుడు మెసేజ్ పెట్టాడు. నెటిజన్‌ను ముగ్గులోకి దింపేందుకు నిందితులు ఈ మెసేజ్‌తో పాటు ధోని ఫొటోను అతడి స్లోగ‌న్ ‘విజిల్ పోడును’ కూడా జతచేశారు. ఇది చూసిన నెటిజన్ షాకైపోయాడు.

Viral: మాజీ పోలీసు అధికారి కొడుకు దారుణం.. గర్ల్‌ఫ్రెండ్ కోసం తెచ్చిన బర్గర్‌లో సగం ఫ్రెండ్ తిన్నాడని..


ఈ ఉదంతం నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది. రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది నిజమేమో అనేలా సైబర్ నేరగాళ్లు పంపించిన మెసేజ్ చూసి జనాలు షాకైపోతున్నారు. నిందితులు పక్కా ప్లాన్ వేశారంటూ కామెంట్ చేశారు. అయితే, ఇలాంటి మెసేజీలతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్ మోసాలు రకరకాల రూపాల్లో జరుగుతాయని, నిందితులు ఎప్పటికప్పుడు కొత్త విధానాలతో అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తుంటారని హెచ్చరించారు. ముక్కూముఖం తెలీని వాళ్లకు అస్సలు డబ్బు పంపించకూడదని, డబ్బు పంపించే అకౌంట్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్నాకే నగదు బదిలీ చేయాలని హెచ్చరిస్తున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 09:43 PM