Share News

Viral News: వామ్మో.. పేపర్ బ్యాగ్ ధర మూడు లక్షల రూపాయలా?

ABN , Publish Date - Jan 16 , 2024 | 06:56 PM

మీరెప్పుడైనా లక్షల రూపాయల పేపర్ బ్యాగ్ గురించి విన్నారా. లేదా అయితే ఈ వార్తను మీరు చదవాల్సిందే. ఎందుకంటే ఇటివల మార్కెట్లోకి వచ్చిన ఓ ప్రముఖ కంపెనీ పేపర్ బ్యాక్ ఏకంగా రూ.2,80,000గా ఉంది.

Viral News: వామ్మో.. పేపర్ బ్యాగ్ ధర మూడు లక్షల రూపాయలా?

మీరెప్పుడైనా లక్షల రూపాయల పేపర్ బ్యాగ్(paper bag) గురించి విన్నారా. లేదా అయితే ఈ వార్తను మీరు చదవాల్సిందే. ఎందుకంటే ఇటివల మార్కెట్లోకి వచ్చిన ఓ ప్రముఖ కంపెనీ పేపర్ బ్యాక్ ఏకంగా రూ.2,80,000గా ఉంది. ఇది తెలిసిన పలువురు ఆశ్చర్యానికి లోనవుతుండగా..మరికొంత మంది మాత్రం ఆ బ్యాగుకు ఎందుకంత రేటు అని ప్రశ్నిస్తున్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Elephant Tax: జంగిల్ ట్యాక్స్ కడితేనే ఎంట్రీ.. తల్లీకూతుళ్ల డిమాండ్

ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ తన శాండ్‌విచ్ బ్యాగ్‌(Sandwich paper Bag)ని స్ప్రింగ్ సమ్మర్ 2024 ఫ్యాషన్ షోలో ఈ మేరకు ప్రదర్శించారు. క్లాసిక్ పేపర్ బ్యాగ్‌ని పోలి ఉండే ఆ బ్యాగ్ జనవరి 4న అమ్మకానికి వచ్చింది. అయితే బ్యాగ్ ధర ప్రస్తుతం అనేక మందిని ఆకర్షిస్తోంది. ఆ బ్యాగ్ ట్యాగ్‌పై రూ.రూ.2,80,000గా ఉంది.

paper bag.JPG

పురుషుల దుస్తుల క్రియేటివ్ డైరెక్టర్ ఫారెల్ విలియమ్స్ ఈ బ్యాగ్‌ను రూపొందించారు. బ్రాండ్ వెబ్‌సైట్ ప్రకారం ఈ లెదర్ బ్యాగ్ హౌస్ యొక్క ప్రసిద్ధ షాపింగ్ బ్యాగ్‌ల మాదిరిగానే సరిగ్గా అదే రంగులో తయారు చేయబడింది. దీని పొడవు 30 సెంటీమీటర్లు, ఎత్తు 27 సెంటీమీటర్లు, వెడల్పు 17 సెంటీమీటర్లుగా ఉంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. బ్యాగుకు అంత ధర ఉండటమేంటని పలువురు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Jan 16 , 2024 | 06:58 PM