Share News

Viral: గూగుల్ మ్యాప్స్ తప్పు..నమ్మొద్దు.. గ్రామం సరిహద్దులో బోర్డు.. దీని వెనక కథేంటంటే..

ABN , Publish Date - Mar 15 , 2024 | 07:36 PM

గూగుల్ మ్యాప్ తప్పంటూ కొందరు స్థానికులు పెట్టిన బోర్డు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: గూగుల్ మ్యాప్స్ తప్పు..నమ్మొద్దు.. గ్రామం సరిహద్దులో బోర్డు.. దీని వెనక కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: కొత్త చోట్లకు వెళ్లాలంటే ఒకప్పుడు సాధారణ మ్యాపులనో లేదా స్థానికులను దారి అడుగుతూనో వెళ్లేవాళ్లం. గూగుల్,యాపిల్ మ్యాప్స్ (Google Maps) అందుబాటులోకి వచ్చాక వాటిని అనుసరిస్తూ కొత్త చోట్లకు వెళ్లిపోతున్నాం. అయితే, గూగుల్ మ్యాప్స్‌లోనూ అప్పుడప్పుడూ తప్పులు దొర్లుతాయి. ఇలాంటి పొరపాట్ల కారణంగా ఇప్పటికే అనేక మంది చిక్కుల్లో పడి స్థానికుల సాయంతో గట్టెక్కారు. ఇలాంటి ఇబ్బందుల్లో పడకుండా కొత్తవారిని హెచ్చరించేందుకు కొందరు గ్రామస్థులు చేసిన ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..


కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఓ చోట కొందరు గ్రామస్థులు గూగుల్ తప్పు..అంటూ ఓ బోర్డు ఏర్పాటు చేశారు. గూగుల్‌ మ్యాప్స్‌లో ఉన్నట్టు ఆ రోడ్డు క్లబ్ మహీంద్రాకు వెళ్లదని బోర్డుపై రాశారు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో ఈ ఉదంతం ఒక్కసారిగా వైరల్‌ అయిపోయింది. దీన్ని చూసి జనాలు పడీపడీ నవ్వుకుంటున్నారు (Locals Set Up Google Is Wrong Signboard).

Viral: తప్పు చేసి భారీ మూల్యం చెల్లించిన బబూన్ కోతి! సింహం ఏ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుందో చూస్తే..


ఈ ఉదంతంపై నెట్టింట బోలెడన్నీ కామెంట్స్ వచ్చిపడ్డాయి. ఆ ప్రాంతంలో అనేక మంది గూగుల్ మ్యాప్స్‌ను నమ్మి తప్పిపోవడంతో స్థానికులు ఇలా చేసుంటారంటూ కొందరు వివరించారు. వారిపై ప్రశంసలు కురిపించారు. పక్కవారేమైపోయినా పట్టని ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు ఉండటం నిజంగా గొప్ప విషయమే అని చెప్పుకొచ్చారు. నగరాలు, పట్టణాల్లో గూగుల్ అద్భుతంగా పనిచేసినా కొండ ప్రాంతాలు, పెద్దగా పాప్యులర్ కానీ ప్రాంతాల్లో గూగుల్ అప్పుడప్పుడూ తడబడుతోందని కొందరు తెలిపారు.

Viral: ఇది నిజంగా అద్భుతం.. నేనైతే ఫిదా.. యువకుడిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 07:43 PM