Sunita Williams: స్పేస్ స్టేషన్‌లో సునీతా విలియమ్స్ డ్యాన్స్..వీడియో చుశారా..
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:28 PM
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(59)(Sunita Williams) అరుదైన ఘనతను సాధించారు. తాజాగా ఆమె భాగస్వామి బుచ్ విల్మోర్(Butch Wilmore)తో గురువారం సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(59)(Sunita Williams) అరుదైన ఘనతను సాధించారు. తాజాగా ఆమె భాగస్వామి బుచ్ విల్మోర్(Butch Wilmore)తో గురువారం సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(viral video) అవుతోంది.
వీడియోలో బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన క్రమంలో వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహోద్యోగి బుచ్ విల్మోర్ కూడా ఎగిరే సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆ క్రమంలో వారిద్దరూ తమ వ్యోమనౌకను తమ అధీనంలోకి తీసుకుని సొంతంగా చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా సునీతా రికార్డు సృష్టించడం విశేషం.
అంతేకాదు విలియమ్స్ గతంలో గణేశ విగ్రహాన్ని, భగవద్గీతను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇది ఆమెకు మూడో అంతరిక్ష యాత్ర. అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే ఆమె సంతోషంతో నృత్యం చేస్తూ కనిపించారు. ఆ సమయంలో ISSలో ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములు కూడా నృత్యం చేసి ఆమెను హత్తుకున్నారు. స్టార్‌లైనర్‌లో ప్రయాణించిన మొదటి సిబ్బంది విలియమ్స్, విల్మోర్. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన 26 గంటల తర్వాత వారు బోయింగ్ అంతరిక్ష నౌకను ISSలో విజయవంతంగా ల్యాండ్ చేశారు.
ISSకి వెళ్లే మార్గంలో, సిబ్బంది స్టార్‌లైనర్‌ను మొదటిసారి అంతరిక్షంలోకి మానవీయంగా ఎగురవేయడంతోపాటు అనేక పరీక్షలను పూర్తి చేశారు. విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో ఒక వారం గడుపుతారు. వివిధ కారణాల వల్ల బోయింగ్ స్టార్‌లైనర్ విమానానికి పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అంతిమంగా ఇది ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రారంభించబడింది. మే 1987లో సునీతా US నావల్ అకాడమీ నుంచి శిక్షణ తీసుకున్నారు. దీని తర్వాత ఆమె US నేవీలో చేరింది. 1998లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికయ్యారు. అంతకుముందు సునీతా విలియమ్స్ 2006, 2012లో అంతరిక్ష యాత్రలలో భాగమయ్యారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ ఫొటోలో విభిన్నమైన జంట ఏదో కనిపెడితే మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.