Share News

Indian Dishes: ప్రపంచ 100 ఉత్తమ వంటకాలలో మనవీ ఓ నాలుగు.. ఘుమఘుమల జాబితాలోని భారత్ ఆహారాలివే..!

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:37 PM

మొత్తం 10,927 వంటకాలు ఎంపిక కాగా ఈ రేసులో విజయవంతంగా టాప్ 100లోకి చొచ్చుకెళ్లిన భారత్ ఘుమఘుమలు ఇవీ..

Indian Dishes: ప్రపంచ 100 ఉత్తమ వంటకాలలో   మనవీ ఓ నాలుగు.. ఘుమఘుమల జాబితాలోని భారత్ ఆహారాలివే..!

ఆహారం గురించి ప్రస్తావిస్తే భారత్ లో ఉన్నన్ని రుచులు ఇంకే దేశంలో ఉండవనే మాట ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. సాధారణంగా వండుకుని తినే ఆహారాలు వేరు, స్పెషల్ ట్యాగ్ తెచ్చుకున్న ఆహారాల క్రేజ్ వేరు ఉంటుంది. టేస్ట్ అల్టాస్ వెబ్ సైట్ ఆహార ప్రియుల రేటింగ్ ఆధారంగా ప్రపంచ నలుమూలల నుండి ఎంపిక చేసిన ఈ టాప్ 100 లిస్ట్ లో నాలుగు భారత్ ఆహారాలు స్థానం సంపాదించాయి. మొత్తం 10,927 వంటకాలు ఎంపిక కాగా ఈ రేసులో విజయవంతంగా టాప్ 100లోకి చొచ్చుకెళ్లిన భారత్ ఘుమఘుమలు ఇవే..

బటర్ గార్లిక్ నాన్..

బటర్ గార్లిక్ నాన్ పుట్టింది ఉత్తర భారతదేశంలో. కానీ ఇది దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. మైదా పిండి, ఈస్ట్, పెరుగు మిశ్రమంతో చేసే ఈ నాన్ కు వెన్న, వెల్లుల్లి జోడిండం వల్ల అద్భుతమైన రుచి తోడవుతుంది. తినడానికి మృదువుగా చాలా రుచిగా ఉంటుంది. మన బటర్ గార్లిక్ నాన్ కు టాప్ 100 వంటకాలలో 4.67 రేటింగ్ తో 7వ ర్యాంక్ దక్కింది.

bn.jpg

ఇది కూడా చదవండి: జాగ్రత్త.. ఈ ఆహారాలు తింటే యూరిక్ యాసిడ్ పెరగడంతో పాటూ బోలెడు రోగాలు వస్తాయ్!


ముర్గ్ మఖానీ..

ముర్గ్ మఖానీని బటర్ చికెన్ అని పిలుస్తారు. ఇది పంజాబీ వంటకం. చికెన్ ను సుగంధ ద్రవ్యాలు, పెరుగు మిశ్రమంలో నానబెట్టిన తరువాత వెన్న, టమోటా ప్యూరీలో చిన్న మంట మీద ఎక్కువ సేపు ఉడికించడం ద్వారా దీన్ని తయారుచేస్తారు. మాంసాహార ప్రియులకు ఇది అత్యుత్తమ ఆహారం. ప్రపంచ వ్యాప్తంగా 100 అత్యుత్తమ వంటకాలలో 4.54 రేటింగ్ తో 43వ ర్యాంక్ దక్కింది దీనికి.

bc.jpg

చికెన్ టిక్కా..

చికెన్ ముక్కలను పెరుగు, సుగంధ ద్రవ్యాలలో నానబెడతారు. తరువాత వీటిని నిప్పుల మీద కాలుస్తారు. కాల్చిన కారణంగా ఇది సాధారణ మాంసం కంటే రుచిగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపికైన 100 అత్యుత్తమ వంటకాలలో 4.54 రేటింగ్ తో 47వ ర్యాంక్ దక్కింది దీనికి.

ct.jpg

ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే వీటిని తప్పక తినాల్సిందే..!

తందూరీ..

తందూరీని మాంసం చేయడానికే కాకుండా తందూరీ రోటీ, తందూరీ బిర్యానీ, తందూరీ మసాలా, తందూరీ ఛాయ్ కూడా చేస్తారు. మట్టిపొయ్యి ఉపయోగించి చేసే ఈ వంటలు కాలిన వాసనతో రుచిగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక కాబడిన 100 అత్యుత్తమ వంటకాలలో 4.54 రేటింగ్ తో తందూరీ 48వ ర్యాంక్ దక్కించుకుంది.

td.jpg

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 12:41 PM