జాగ్రత్త.. ఈ ఆహారాలు తింటే యూరిక్ యాసిడ్ పెరగడంతో పాటూ బోలెడు రోగాలు వస్తాయ్!

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే  అధిక రక్తపోటు,  కిడ్నీలో రాళ్లు, గౌడ్, గుండె జబ్బుల సమస్యలు వస్తాయి.  యారిక్ యాసిడ్ పెరగడానిరి కొన్ని ఆహారాలు ప్రధాన కారణం అవుతాయి.

పీతలు, రొయ్యలు, ఎండ్రకాయలలో ప్యూరిన్ స్థాయిలు ఎక్కువ ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ పెరుగుదలకు కారణం అవుతుంది.

బీర్, ఇతర ఆల్కహాల్ ఆధారిత డ్రింక్స్ లో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెంచుతాయి.

అధికంగా చక్కెర పానీయాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.

ఆస్పరాగస్, బచ్చలికూర, పాలకూర,  కాలీఫ్లవర్, పుట్టగొడుగులు, బఠానీలు వంటి కూరగాయలలో ప్యూరిన్లు ఎక్కువ ఉంటాయి. యూరిక్ యాసిడ్ పెంచుతాయి.

బీర్, బ్రెడ్, బేకింగ్ చేసిన ఆహారాలలో ఈస్ట్  ఉంటుంది. ఇది ప్యూరిన్ స్థాయిలు పెంచి యూరిక్ యాసిడ్ పెరగడానికి దారితీస్తుంది.

ఫుల్ ఫ్యాట్ మిల్క్, ఛీజ్ వంటి అధిక కొవ్వు పదార్థాలు యూరిక్ యాసిడ్ పెంచుతాయి.

 సార్డినెస్, ఆంకోవీస్ వంటి సముద్రపు ఆహారాలలో ప్యూరిన్ అధికం. ఇవి యూరిక్ యాసిడ్ పెంచుతాయి.

రెడ్ మీట్ లో ప్యూరిన్ పరిమాణం చాలా ఎక్కువ. ఇది యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.