Air Conditioner: ఏసీకి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఎన్నేళ్లు వాడొచ్చంటే..
ABN , Publish Date - Jun 17 , 2024 | 05:10 PM
ఏసీని గరిష్ఠంగా 10 ఏళ్ల వరకూ ఎలాంటి భయాలు లేకుండా వాడుకోవచ్చు. అయితే వీటిని రెగ్యులర్ గా సర్వీసింగ్‌కు ఇస్తుండాలి. రిఫ్రెజిరెంట్ లీక్ కావడం లేదా ఏసీని నిరంతరంగా వాడటం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించొచ్చు.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. ఫలితంగా ఏసీల వాడకం విపరీతంగా పెరిగింది. అనేక చోట్ల ఏసీలు పేలి ఆస్తి నష్టం కూడా సభవించింది. ఏసీ తప్పనిసరి కావడంతో అనేక మంది కొత్తగా కొంటుంటే మరికొందరు పాత వాటిని సర్వీస్ చేయించి మళ్లీ వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏసీ (AC) ఎంతకాలం వాడొచ్చనే సందేహం కలుగుతుంది. మరి ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
సాధారణంగా ఇళ్లల్లో వాడే ఏసీలు రెండు రకాలు. ఒకటి విండో ఏసీ, రెండోది స్ప్లిట్ ఏసీ. విండో ఏసీలో గాలి వీచే యూనిట్, గాలిని చల్లబరిచే యూనిట్ ఒకే చోట ఉంటాయి. స్ప్లిట్ ఏసీలో మాత్రం ఈ రెండు వేర్వేరుగా ఉంటాయి. ఔట్ డోర్ యూనిట్ ను బాల్కనీల్లో బిగించుకుంటారు.
AC: కూలర్‌తో విసిగిపోయారా.. రూ.300లతో ఏసీ తయారు చేయొచ్చిలా
ఇక ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని ఏసీ బ్రాండ్లను పదేళ్ల పాటు ఎటువంటి భయాలు లేకుండా వాడుకోవచ్చు. అయితే, తరచూ వీటిని సర్వీసింగ్ చేయడించడం తప్పనిసరి. సాధారణంగా విండో ఏసీ 8 నుంచి 10 సంవత్సరాల వరకూ ఏ ఇబ్బందీ లేకుండా పనిచేస్తుంది. స్ప్లిట్ ఏసీ గరిష్ఠంగా 15 సంవత్సాల వరకూ పనిచేస్తుందని కొందరు చెబుతుంటారు. ఏసీ మెయింటెనెన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే తరచూ అవి పాడవుతాయి.
ఇక స్ప్లిట్ ఏసీలను నిరంతరంగా వాడితే వాటి కంప్రెసర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అవి వేడెక్కి అగ్ని ప్రమాదాలు సంభవించొచ్చు. ఇక ఏసీల్లో రెఫ్రిజ్‌రెంట్ లీక్ కాకుండా చూసుకోవాలి. వీటిల్లో లీకులు తలెత్తితే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
Read Technology and Telugu News