Share News

Hair Color: హెన్నాలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు.. సెలూన్ టైప్ హెయిర్ కలర్ ఇంట్లోనే సిద్దం..!

ABN , Publish Date - Mar 27 , 2024 | 03:00 PM

చాలామందికి సెలూన్ లో లభించే హెయిర్ కలర్ మీద ఇష్టం ఉంటుంది. ఇలాంటి హెయిల్ కలర్ ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు.

Hair Color:  హెన్నాలో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు..  సెలూన్ టైప్ హెయిర్ కలర్ ఇంట్లోనే  సిద్దం..!

జుట్టుకు హెన్నా పెట్టడం ఇప్పట్లో చాలా కామన్ అయింది. కొందరు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి హెన్నా పెట్టుకుంటే.. మరికొందరు తెల్ల జుట్టు కవర్ చేయడానికి, ఇంకొందరు జుట్టు ముదురు గోధుమ రంగులో కనిపించడానికి హెన్నా పెడుతుంటారు. ఆరోగ్యం గురించి స్పృహ ఉన్నవారు రసాయనాలున్న హెయిర్ డైలు వదిలి హెన్నా అప్లై చేస్తుంటారు. అయితే చాలామందికి సెలూన్ లో లభించే హెయిర్ కలర్ మీద ఇష్టం ఉంటుంది. ఇలాంటి హెయిల్ కలర్ ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. అందుకోసం హెన్నాలో కేవలం ఒక పదార్థం కలిపి రాస్తే సరిపోతుంది. అదేంటో.. అదెలా వేయాలో తెలుసుకుంటే..

డార్క్ బ్రౌన్..

జుట్టు డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంచుకోవడం ఇప్పట్లో ఫ్యాషన్. డార్క్ బ్రౌన్ కలర్ రావాలి అంటే గోరింటాకులో ఇండిగో అంటే నీలిమందు కలపాలి. ఇవి రెండూ జుట్టుకు మంచి రంగు ఇస్తాయి. కానీ జుట్టుకు ఎలాంటి హాని కలిగించవు. అయితే జుట్టుకు హెన్నా పెట్టడానికి గోరింటాకు పొడి ఎంత మొత్తంలో తీసుకుంటున్నాం, ఇండిగో పౌడర్ ఎంత మొత్తంలో తీసుకుంటున్నాం అనేది గమనించుకోవాలి.

ఇది కూడా చదవండి: భారతదేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేసిన 9మంది వ్యాపారవేత్తలు వీళ్లే..!


హెన్నా పౌడర్ ఒక భాగం తీసుకుంటే.. ఇండిగో పొడర్ రెండు భాగాలు తీసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు డార్క్ బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. అదే హెన్నా ఒక భాగం అయితే మూడు లేదా నాలుగు భాగాల ఇండిగో పౌడర్ తీసుకుంటే జుట్టు ముదురు నలుపు రంగులోకి మారుతుంది.

హెన్నా ఎలా తయారుచేయాలంటే..

హెన్నా ఒక భాగం తీసుకుని అందులో వేడినీరు వేసి దాన్ని చిక్కటి ద్రావణంలా తయారుచేసుకోవాలి. దీన్ని 20నిమిషాల పాటూ అలాగే వేడినీటిలో నానబెట్టాలి. దీని తరువాత హెన్నా ద్రావణంలో రెండు భాగాల నీలిమందు పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా 20నిమిషాల పాటూ నానబెట్టాలి. 20 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. తల ఆరిపోకుండా ఉండేందుకు షవర్ క్యాప్ ధరించాలి. కనీసం గంట నుండి గంటన్నర వరకు దీన్ని అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత గాఢత లేని షాంపూతో జుట్టును కడుక్కోవాలి. అంతే సెలూన్ లాంటి డార్క్ బ్రౌన్ కలర్ జుట్టుకు వచ్చేసినట్టే.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 27 , 2024 | 03:00 PM