భారతదేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేసిన   9మంది వ్యాపారవేత్తలు వీళ్లే..!

ధీరూభాయ్ అంబానీ..(1932-2002) 1958లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ను స్థాపించారీయన. 1977లో రిలయన్స్ పబ్లిక్ గా మార్చారు.

ఘనశ్యామ్ దాస్ బిర్లా..(1894-1983) కుటుంబం నుండి వారసత్వంగా లభించిన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి విజయం సాధించారు.

అర్దేశీర్ బుర్జోర్జి సొరాబ్జీ గోద్రెజ్.. (1868-1936) సోదరుడు పిరోజ్షా బుర్జోర్జితో కలిసి గోద్రెజ్ బ్రదర్స్ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం ఇది గోద్రెజ్ గ్రూప్ గా  పిలవబడుతోంది.

గోవిందం సెక్సరియా.. భారతదేశంలోని కాటన్ కింగ్ గా పేరుగాంచారు. స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఈయన ఒకరు.

భాయ్ మోహన్ సింగ్..(1917-2006) ఈయన ఫార్మాస్యూటికల్ దిగ్గజం. రాన్ బాక్సీ లాబొరేటరీస్ లిమిటెడ్ సంస్ఖను రెండ ప్రపంచ యుద్ద సమయంలో స్ఖాపించారు.

జమ్ సెట్టీ టాటా.. భారత పరిశ్రమ పితామహుడు అయిన జమ్ సెట్టీ టాటా విశాలమైన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

కెసి మహీంద్రా.. (1894-1963) కైలాష్ చంద్ర మహీంద్రా  భారతీయ పారిశ్రామికవేత్త. మహీందా&మహీంద్రా సహ వ్యవస్థాపకుడు.

వర్గీస్ కురియన్.. (1921-2012) ధన విప్లవ పితామహునిగా ఈయనను పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ అభివృద్ది కార్యక్రమాన్ని ఈయన చేపట్టారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది.

JRD టాటా.. RD టాటా కుమారుడీయన. జెంసెట్టీ టాటా వ్యాపార భాగస్వామి, బంధువు.   1925లో టాటా గ్రూప్ లో అప్రెంటిస్ గా చేరాడు. తండ్రి మరణం తరువాత టాటా సన్స్ బోర్డ్ లో చేరాడు.