Share News

Viral: తొలిసారి భార్యను వందేభారత్ రైలెక్కించేందుకు వెళ్లి.. ఓ రేంజ్‌లో ఇరుక్కుపోయాడుగా..!

ABN , Publish Date - Apr 02 , 2024 | 07:32 PM

భార్యను వందేభారత్ రైలెక్కించేందుకు వెళ్లి రైల్లోనే ఇరుక్కుపోయిన పెద్దాయన ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంది.

Viral: తొలిసారి భార్యను వందేభారత్ రైలెక్కించేందుకు వెళ్లి.. ఓ రేంజ్‌లో ఇరుక్కుపోయాడుగా..!

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబసభ్యులను రైలు ఎక్కించేందుకు వెళ్లినప్పుడు ఎవరినైనా సరే సామాన్లను సీటు వద్ద సర్ది మరీ వస్తారు. ఓ పెద్దాయన కూడా సరిగ్గా ఇదే చేశారు. తన భార్యను వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ (VandeBharat Express) రైలెక్కించేందుకు వెళ్లిన ఆయన ఆమె లగేజీని సీటు వద్ద సర్దారు. కానీ ఆ తరువాత సీన్ ఊహించని మలుపు తిరిగింది. దీంతో, దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పెద్దాయన చివరకు కూతురికి మెసేజ్ చేసి జరిగింది చెప్పారు. ఈ విషయాన్ని ఆమె నెట్టింట పంచుకోవడంతో ఈ ఫన్నీ ఉదంతం వైరల్‌గా (Viral) మారింది.

Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..


తన తల్లిదండ్రులకు ఎదురైన అనుభవాన్ని కోషా అనే మహిళ నెట్టింట పంచుకుంది. తన తల్లి వడోదర నుంచి ముంబై వెళ్లేందుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బుక్ చేసుకున్నట్టు చెప్పింది. ఆమెకు వందేభారత్‌లో ప్రయాణించడం అదే తొలిసారి కావడంతో ఆమెను తన తండ్రి స్టేషన్ వద్ద దిగబెట్టేందుకు వచ్చారని తెలిపింది.

Viral: ఈ పెద్దాయనను చూడండి! వీధుల్లో ట్రాఫిక్ పోలీసులు ఎదురుపడితే..

ఈ క్రమంలో లగేజీని తల్లి సీటు వద్ద సర్ది వస్తుండగా రైల్లోని ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోవడంతో ఆయన రైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది (Man Locked in VandeBharat). ఈ ఉదంతాన్ని తండ్రి తనకు మెసేజ్ చేసి చెప్పడంతో పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వుకున్నానని పేర్కొంది. తన తల్లిదండ్రులు ఇద్దరూ చివరకు వందేభారత్‌లోనే ప్రయాణించారని తెలిపింది. సూరత్‌లో దిగిపోయిన ఆయన వడోదరకు రిటర్న్ టిక్కెట్ కోసం ప్రయత్నించాలని వివరించింది.

Viral: ప్రతి ఆసుపత్రిలో ఇలాంటి నర్సు ఉంటేనా.. వైరల్ వీడియో!


నెటిజన్లకు ఈ ఫన్నీ ఉదంతం తెగ గిలిగింతలు పెట్టడంతో వైరల్‌గా మారింది. వేల కొద్దీ వ్యూస్, కామెంట్స్ వస్తున్నాయి. విషయం తెలిసి జనాలు పడీ పడీ నవ్వుకుంటున్నారు. ఇలాంటివి తమ జీవితంలోనూ ఎదురయ్యాయని కొందరు చెప్పుకొచ్చారు.

Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 07:36 PM