Share News

Viral Video: గొరిల్లాలో ఈ యాంగిల్ కూడా ఉంటుందా? చిన్న పక్షితో స్నేహం కోసం గొరిల్లా ప్రయత్నం చూడండి..

ABN , Publish Date - May 25 , 2024 | 04:06 PM

విభిన్న జాతులకు చెందిన జీవుల మధ్య స్నేహం అనేది చాలా అరుదుగా ఉంటుంది. చాలా జంతువులు తమ జాతికి చెందిన వాటితో మాత్రమే కలిసి ఉంటాయి. ఇతర జాతుల జంతువులతో గొడవలకు దిగుతాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని జంతువులు చాలా ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తాయి.

Viral Video: గొరిల్లాలో ఈ యాంగిల్ కూడా ఉంటుందా? చిన్న పక్షితో స్నేహం కోసం గొరిల్లా ప్రయత్నం చూడండి..
Gorilla friendship with bird

విభిన్న జాతులకు చెందిన జీవుల మధ్య స్నేహం అనేది చాలా అరుదుగా ఉంటుంది. చాలా జంతువులు (Animals) తమ జాతికి చెందిన వాటితో మాత్రమే కలిసి ఉంటాయి. ఇతర జాతుల జంతువులతో గొడవలకు దిగుతాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని జంతువులు చాలా ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. ఆ వీడియోలో ఓ గొరిల్లా (Gorilla) ఓ చిన్న పక్షితో (Bird) ఎంతో స్నేహపూర్వకంగా ప్రవర్తించింది. ఆ వీడియో నెటిజన్ల హృదయాలను ఆకట్టుకుంటోంది (Viral Video).


@museumpix అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. కెనడాలోని కాల్గరీ జూలో ఈ వీడియోను చిత్రీకరించారు. తన ఎన్‌క్లోజర్‌లో ఉన్న గొరిల్లా వద్దకు ఓ చిన్న పక్షి వెళ్లింది. ఆ పక్షితో గొరిల్లా ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించింది. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అది నడవడానికి అడ్డు లేకుండా గడ్డిని పక్కకు తొలగించింది. ఆ పక్షికి ఎటువంటి హానీ తలపెట్టకుండా ప్రవర్తించింది. మధ్య మధ్యలో తన తల గోక్కుంటూ విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Gorilla friendship with bird).


ఈ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఒంటరిగా ఉన్న గొరిల్లాకు నేస్తం దొరికింది``, ``వావ్, ప్రకృతి మాయాజాలం మనందరినీ మంత్రముగ్దులను చేస్తుంది``, ``ఆ గొరిల్లా ఆ చిన్న పక్షితో చాలా సౌమ్యంగా ఉంది``, ``స్నేహం అనే అద్భుత అనుభూతి కేవలం మనుషులకే పరిమితం కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఆ కుర్రాడు కరెంట్‌కే షాకిచ్చాడు.. ప్రాణాంతక స్టంట్ చేస్తే ఏం జరిగిందో చూడండి..!


Viral Video: వామ్మో.. ఇదెక్కడి సరదా.. వరుడిని బైక్‌తో సహా పైకి లేపి డ్యాన్స్.. ఏం జరిగిందో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 25 , 2024 | 04:06 PM