Share News

Viral Video: వామ్మో.. ఇదెక్కడి సరదా.. వరుడిని బైక్‌తో సహా పైకి లేపి డ్యాన్స్.. ఏం జరిగిందో చూడండి..!

ABN , Publish Date - May 25 , 2024 | 09:47 AM

పూర్వ కాలంలో వరుడు గుర్రంపై పెళ్లి వేడుక వద్దకు వచ్చేవాడు. ఆ తర్వాత సాంప్రదాయాలు మారిపోయాయి. కార్లు, వ్యాన్‌లపై వస్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వరుడు బైక్‌పై కల్యాణ మండపానికి వచ్చాడు.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి సరదా.. వరుడిని బైక్‌తో సహా పైకి లేపి డ్యాన్స్.. ఏం జరిగిందో చూడండి..!
Groom on Bike

పూర్వ కాలంలో వరుడు (Groom) గుర్రంపై పెళ్లి (Marriage) వేడుక వద్దకు వచ్చేవాడు. ఆ తర్వాత సాంప్రదాయాలు మారిపోయాయి. కార్లు, వ్యాన్‌లపై వస్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వరుడు బైక్‌పై కల్యాణ మండపానికి వచ్చాడు (Groom on Bike). బైక్‌పై ఉన్న అతడితో అతడి స్నేహితులు, బంధువులు చేసిన హంగామా చూస్తే నవ్వు రాక మానదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు (Viral Video).


the_johar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వరుడు తలకు కండువా, కళ్లజోడు, వీపుపై బాణాలు, మెడలో రంగురంగుల దండ వేసుకుని బైక్‌పై పెళ్లి ఊరేగింపుతో వచ్చాడు. ఊరేగింపులో పాల్గొన్న బంధువులు, స్నేహితులు బైక్‌తో పాటు వరుడిని తమ భుజాలపై మోసుకెళుతున్నారు. బైక్‌తో పాటే వరుడిని కూడా గాల్లో డ్యాన్స్‌లు చేయించి చుట్టూ తిప్పారు. అయినా ఆ వరుడు ధైర్యంగా బైక్‌పై కూర్చుని చిరునవ్వులు చిందించాడు.


ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మామగారు డ్యాన్సింగ్ బైక్ ఇచ్చినట్టున్నారు``, ``వరుడు భయపడుతూనే నవ్వుతున్నాడు``, ``ఇదెక్కడి సరదా``, ``ఏ మాత్రం తేడా జరిగినా వరుడు హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఇది మామూలు పక్షి ఈక అనుకుంటున్నారా? దీని ఖరీదు 25 తులాల బంగారం కంటే ఎక్కువ.. కారణమేంటంటే..


Viral Video: వామ్మో.. ఈ చిరుత వేగం చూస్తే మన కళ్లు తిరగడం ఖాయం.. వేట కోసం చిరుత ఎలా పరిగెత్తిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 25 , 2024 | 10:03 AM