Share News

Viral Video: వామ్మో.. ఆ కుర్రాడు కరెంట్‌కే షాకిచ్చాడు.. ప్రాణాంతక స్టంట్ చేస్తే ఏం జరిగిందో చూడండి..!

ABN , Publish Date - May 25 , 2024 | 01:47 PM

విద్యుత్తు మానవ జీవితాన్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చింది. విద్యుత్తు లేకపోతే ప్రస్తుతం 90 శాతం పనులు ఆగిపోతాయి. అంతలా మనకు ఉపయోగపడుతున్న విద్యుత్తుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం షాక్ తగిలినా తీవ్ర గాయాల పాలు కావాల్సిందే. లేదా ప్రాణాలు కోల్పోవాల్సిందే.

Viral Video: వామ్మో.. ఆ కుర్రాడు కరెంట్‌కే షాకిచ్చాడు.. ప్రాణాంతక స్టంట్ చేస్తే ఏం జరిగిందో చూడండి..!
Dangerous stunt with Electricity

విద్యుత్తు (Electricity) మానవ జీవితాన్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చింది. విద్యుత్తు లేకపోతే ప్రస్తుతం 90 శాతం పనులు ఆగిపోతాయి. అంతలా మనకు ఉపయోగపడుతున్న విద్యుత్తుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం షాక్ (Electric Shock) తగిలినా తీవ్ర గాయాల పాలు కావాల్సిందే. లేదా ప్రాణాలు కోల్పోవాల్సిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ కుర్రాడిని కరెంట్ ఏమీ చేయలేకపోయింది. కరెంట్ వైర్లు నోట్లో పెట్టుకున్నా ఆ కుర్రాడు మామూలుగానే ఉన్నాడు (Viral Video).


rajumala88 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు రెండు వైర్లను (Electric wires) డైరెక్ట్‌గా కరెంట్ మీటర్‌కు తగిలించాడు. వాటిని తన నోటిలో పెట్టుకున్నాడు. అయినా ఆ కుర్రాడు సాధారణంగానే ఉన్నాడు. మరో వ్యక్తి టెస్టర్‌తో పరీక్షించగా ఆ కుర్రాడి శరీరంలో విద్యుత్తు ప్రవహిస్తున్నట్టు తేలింది. అయినా కరెంట్ తనకు ఎటువంటి హాని కలిగించనట్లుగా ఆ వ్యక్తి చాలా సౌకర్యవంతంగా నిలబడి ఉన్నాడు. ఈ డెత్ గేమ్‌ను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియోను చూసిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ``ఒక్కసారి చెప్పులు తీసి చూడు``, ``జీవితం జోక్ కాదు.. ప్రాణాలు పోతాయి``, ``ఇది అత్యంత ప్రమాదకరం``, ``ఇది డెత్ గేమ్``, ``ఇందులో ఏదో ట్రిక్ ఉంది.. దయచేసి ఎవరూ ప్రయత్నించకండి``, ``అతడు కరెంట్ మ్యాన్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆటోని ఇల్లు ఎక్కించాడు.. అతడు ఎందుకలా చేశాడో తెలిస్తే ప్రశంసించకుండా ఉండలేరు..!


Opitcal Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో సీతాకోకచిలుక ఎక్కడుందో 6 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 25 , 2024 | 01:47 PM