Share News

Elephant Video: దెబ్బకు ఏనుగును కూడా ఉరికించాడు భయ్యా.. ఈ డ్రైవర్ ధైర్యం చూస్తే షాకవ్వకుండా ఉండలేరు..!

ABN , Publish Date - Feb 08 , 2024 | 05:50 PM

సరదాగా ఫారెస్ట్ సఫారీకి వెళ్లిన ప్రయాణికుల మీద ఓ ఏనుగు దాడికి దిగితే జీప్ డ్రైవర్ చేసిన పని ఇదీ..

Elephant Video:  దెబ్బకు ఏనుగును కూడా ఉరికించాడు భయ్యా..  ఈ డ్రైవర్  ధైర్యం చూస్తే షాకవ్వకుండా ఉండలేరు..!

అడవి జంతువుల ప్రపంచం పూర్తీగా విభిన్నం. వాటి వల్ల ప్రజలకు హాని కలుగుతుందని తెలిసినా సరే వాటిని చూడటానికి ప్రజలు ఉవ్విళూరతారు. ఈ కారణంగానే వైల్డ్ లైఫ్ పార్కులు ప్రజలను అడవుల్లో సఫారీకి అనుమతి ఇస్తుంటాయి. అలా ఫారెస్ట్ సఫారీకి వెళ్లిన ప్రయాణికుల మీద ఓ ఏనుగు దాడికి దిగింది. అది గమనించిన వెహికల్ డ్రైవర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

చిన్ననాటి నుండి కథలలో చెప్పుకునే ఏనుగులు, పులులు, సింహాలు మొదలైన జంతువులను దగ్గరగా చూడాలనే ఆరాటం అందరికీ ఉండేదే. ఈ ఆరాటంతోనే శ్రీలంకలోని వాస్‌గమువా నేషనల్ పార్క్‌కి కొందరు టూరిస్టులు ఫారెస్ట్ సఫారీకి వెళ్లారు. ఆ ఫారెస్ట్ లో వారు అడవిలో ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా ఏనుగులు ఎదురయ్యాయి. వాటిలో ఒక ఏనుగు ఆవేశంగా ప్రయాణికుల మీద దాడి చేయడానికి పరిగెత్తుకొచ్చింది. అయితే ఈ విషయం గమనించిన జీప్ డ్రైవర్ డోర్ తీసి నిలబడి జీప్ మీద తన బలం కొద్దీ బాదుతాడు. నాలుగైదుసార్లు అలా బాది ఆ ఏనుగును వెనక్కు వెళ్లిపోమ్మంటూ చెయ్యి చూపించాడు. అతని చేతుల్లో మంత్రాలు ఏమైనా ఉన్నాయో ఏమో కానీ ఆ ఏనుగులో ఆవేశం మొత్తం ఒక్కసారిగా తగ్గిపోయింది. సైలెంట్ గా వెనక్కు తిరిగి వెళ్లిపోయింది.

ఇది కూడా చదవండి: వాస్తు ప్రకారం పడకగదిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.


ఈ వీడియోను Wildtrails.in అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'ఇతనికి ఏవైనా మంత్రాలు ఉన్నాయా ఏంటి? ఏనుగును ఎలా పరిగెత్తించాడో' అని ఒకరు కామెంట్ చేస్తున్నారు. 'డ్రైవర్ చాలా తెలివైనవాడు. కంగారుతో వెహికల్ నువెనక్కు తిప్పినా ఆ ఏనుగు ఆగేది కాదు' అని మరొకరు కామెంట్ చేశారు. 'అతనిది ధైర్యమో, తెలివో అనుకంటారు కానీ అడవి జంతువులు కొన్నిసార్లు ఎవ్వరిమాటా వినవు. అలా ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అతను ప్రమాదంతో చెలగాటం ఆడుతున్నాడు' అని మరొకరు ప్రమాదం గురించి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Viral Video: ఎలా వస్తాయి సామీ ఇలాంటి ఐడియాలు.. ఇతను బైక్‌ను ఎలా మార్చేశాడో మీరే చూడండి..!


మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 08 , 2024 | 05:50 PM