Share News

Shocking: స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళను ఆఫీసుకు రమ్మన్న బాస్!

ABN , Publish Date - Apr 13 , 2024 | 06:35 PM

క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని ఆఫీసుకు రావాలంటూ బాస్ కోరారని ఓ యువతి నెట్టింట ఆవేదన వ్యక్తం చేసింది. కెంపెనీ తీరు తెలుసుకున్న నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shocking: స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళను ఆఫీసుకు రమ్మన్న బాస్!

ఇంటర్నెట్ డెస్క్: క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని ఆఫీసుకు రమ్మని పైఅధికారి ఈ-మెయిల్ చేశారంటూ ఓ యువతి బాధపడింది. తన ఆవేదనను పంచుకుంటూ నెట్టింట ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది. కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించిన మహిళ బాస్‌పై నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

ఐర్లాండ్‌లో (Ireland) ఈ ఘటన వెలుగు చూసింది. కాలేజీలో చదువుకుంటున్న ఆ యువతి..క్యాన్సర్ బాధితురాలైన తన తల్లి అవస్థలను నెట్టింట పంచుకుంది. 18 నెలలుగా తను క్యాన్సర్‌తో పోరాడుతున్నట్టు చెప్పింది. వ్యాధి స్టేజ్-4కు చేరుకుందని, కిమోథెరపీ ఇస్తున్నారని వెల్లడించింది.

Viral: ప్యాంటు వేసుకోకపోతే బ్యాంకులోకి రానివ్వరా? కోపంతో ఊగిపోయిన కస్టమర్! జరిగిందేంటంటే..

తన తల్లి పనిచేసే స్థితిలో ఉందా? లేదా? అనేది ధ్రువీకరిస్తూ డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ కోసం మేనేజర్ అడిగాడని ఆమె చెప్పుకొచ్చింది. త్వరలో జరగనున్న ఓ మీటింగ్‌కు ముందు హాజరు కావాలని కూడా బాస్ తన తల్లిని ఆదేశించినట్టు చెప్పింది. తన తండ్రి కూడా దూరంకావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని ఆమె వాపోయింది (Cancer Patient Asked To Come Back To Work).


తన తల్లి అనారోగ్యం పరిహారం కింద ప్రతినెల 200 యూరోలు పొందేదని, కానీ దాని కాలపరిమితి ముగియడంతో ఇటీవలే డిసెబిలిటీ పరిహారం తీసుకోవడం ప్రారంభించిందని తెలిపింది.

కాగా, యువతి పరిస్థితి విన్న నెటిజన్లు ఆమె తల్లి బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీతో మహిళ జరిపే సంవాదాల్నీ రికార్డు చేసి వారి బండారం బయటపెట్టాలని కొందరు సూచించారు. కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 06:40 PM